Hyderabad: కూరగాయాల కొట్టుపై ఆ ఇద్దరి పగ
ABN, Publish Date - Aug 26 , 2024 | 08:03 PM
అల్వాల్ కనాజిగూడలో మానసరోవర్ హైట్స్ అపార్ట్ మెంట్ ఉంది. ఇందులో 400 కుటుంబాల వరకు ఉన్నాయి. బిల్డింగ్ వద్ద ఓ జంట కూరగాయాలు విక్రయిస్తోంది. ప్లాట్లలో అందరూ సీనియర్ సిటిజెన్స్ కావడంతో ఇంటింటికీ వెళ్లి మరి కూరగాయాలు అందజేసే వారు. 20 ఏళ్ల నుంచి వారు అక్కడే ఉంటున్నారు.
హైదరాబాద్: అపార్ట్‌మెంట్‌లో అంతా సీనియర్ సిటిజన్సే. అపార్ట్ మెంట్ వద్ద ఓ జంట కూరగాయాల షాపు పెట్టుకుంది. ఇంటింటికీ కూరగాయాలు డోర్ డెలివరీ చేస్తున్నారు. వీరిలో మెజార్టీ ఓనర్స్ కూరగాయాలు విక్రయించేవారికి సపోర్ట్‌గా ఉన్నారు. ఇద్దరు మాత్రం వ్యతిరేకంగా ఉన్నారు. కూరగాయాల కొట్టుపై మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇంకేముంది మున్సిపల్ సిబ్బంది రాగా.. అపార్ట్ మెంట్‌లో మిగతా యజమానులు కూరగాయాలు విక్రయించే వారికి అండగా నిలిచారు.
ఇది విషయం
అల్వాల్ కనాజిగూడలో మానసరోవర్ హైట్స్ అపార్ట్ మెంట్ ఉంది. ఇందులో 400 కుటుంబాల వరకు ఉన్నాయి. బిల్డింగ్ వద్ద ఓ జంట కూరగాయాలు విక్రయిస్తోంది. ప్లాట్లలో అందరూ సీనియర్ సిటిజెన్స్ కావడంతో ఇంటింటికీ వెళ్లి మరి కూరగాయాలు అందజేసే వారు. 20 ఏళ్ల నుంచి వారు అక్కడే ఉంటున్నారు. పదేళ్ల క్రితం అప్పు చేసి మరి షెడ్డు నిర్మించుకున్నారు. వీరికి ప్లాట్లలో ఉండేవారు కూడా సహకరించారు. ఇప్పటివరకు బాగానే ఉన్నా ఆ తర్వాతే ఇబ్బందులు వచ్చాయి. ప్లాట్లలో ఉండే ఇద్దరు (కామినేని, ప్రసాద్) అభ్యంతరం తెలిపారు. అపార్ట్ మెంట్ వద్ద కూరగాయాల షాపు ఎందుకు అని ప్రశ్నించారు. ఇక్కడి నుంచి షెడ్డు తొలగించాలని స్పష్టం చేశారు. ఇదే విషయంపై మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు.
ఉద్రిక్తం
మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఆందోళన మొదలైంది. అపార్ట్ మెంట్ వాసులు నిరసన చేపట్టారు. కూరగాయాలు విక్రయించే వారికి అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఆ ఇద్దరి తీరును నిరసించారు. అపార్ట్ మెంట్‌లో నిర్మించిన షెడ్డు తొలగించేందుకు అంగీకరించబోమని తేల్చి చెప్పారు. ప్రతి రోజు కూరగాయాలు తీసుకొచ్చే వారి పట్ల ఎందుకు పగ పట్టారని మండిపడ్డారు.
అప్పు చేసి షెడ్డు నిర్మించాం..
‘గత 20 ఏళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నాం. ఎండ, వాన లెక్క చేయకుండా ఉన్నాం. అప్పు చేసి మరి షెడ్డు నిర్మించుకున్నాం. మాకు అపార్ట్ మెంట్ యజమానులు కూడా సాయం చేశారు. ఆ ఇద్దరు మాత్రం మాపై కోపంతో ఉన్నారు. వారు ఎందుకిలా చేస్తున్నారో అర్థం కావడం లేదు. మా పొట్ట కొట్టే ప్రయత్నం సరికాదు. మున్సిపల్ అధికారులకు ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలి అని’ కూరగాయాలు విక్రయించే మహిళ గోడును వెల్లబోసుకున్నారు.
ఇవి కూడా చదవండి
CMRF Scam: సీఎంఆర్‌ఎఫ్ స్కాంలో 17 ఆస్పత్రులపై కేసులు నమోదు
Kodandareddy: హైడ్రాపై ఎంఐఎం, బీఆర్‌ఎస్‌వి అడ్డగోలు విమర్శలు
Read Latest Telangana News And Telugu News
Updated Date - Aug 26 , 2024 | 08:03 PM