ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: ఆ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..! ఎప్పుడంటే..?

ABN, Publish Date - Jul 03 , 2024 | 07:26 PM

భాగ్యనగర వాసులకు అలర్ట్.. రేపు (గురువారం) కొన్ని చోట్ల మంచి నీటి సరఫరాకు అంతరాయం కలుగనుంది. ఈ మేరకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. గురువారం ఉదయం 7 గంటల నుంచి ఒక రోజంతా నీటి సరఫరా జరగదని స్పష్టం చేసింది. అందుకోసం తాగునీటిని జాగ్రత్తగా, అవసరం ఉన్నంత వరకు ఉపయోగించాలని కోరింది.

One Day Break To Water Supply

హైదరాబాద్: భాగ్యనగర వాసులకు అలర్ట్.. రేపు (గురువారం) కొన్ని చోట్ల మంచి నీటి సరఫరాకు (Water Supply) అంతరాయం కలుగనుంది. ఈ మేరకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. గురువారం ఉదయం 7 గంటల నుంచి ఒక రోజంతా నీటి సరఫరా జరగదని స్పష్టం చేసింది. అందుకోసం తాగునీటిని జాగ్రత్తగా, అవసరం ఉన్నంత వరకు ఉపయోగించాలని కోరింది.


పూర్తిగా నీరు రాని ప్రాంతాలు ఇవే

సిటీలో గల షేక్ పేట, జూబ్లీహిల్స్, సోమాజిగూడ, బోరబండ, మూసాపేట, నల్లగండ్ల, చందానగర్, హుడా కాలనీ, హఫీజ్ పేట్, మణికొండ, నర్సింగి, మంచిరేవుల, తెల్లాపూర్‌లో పూర్తిగా నీటి సరఫరా జరగదు. బోజాగుట్ట రిజర్వాయర్, బంజారాహిల్స్, ఎర్రగడ్డ, కేపీహెచ్‌బీ, హైదర్ నగర్‌లో లో ఫ్రెషర్‌తో నీటి సరఫరా జరగనుంది.


సమస్య ఏంటంటే..?

హైదరాబాద్‌కు మంచినీటి సరఫరా సింగూరు 3, 4 ఫేజ్‌ల ద్వారా సరఫరా అవుతోంది. సింగూరు నుంచి 132 కేవీ పెద్దాపూర్, కంది సబ్ స్టేషన్ల నుంచి పవర్ సప్లై జరుగుతుంది. ఆ రెండు సబ్ స్టేషన్లలో టీజీ ట్రాన్స్ కో మరమ్మతులు చేపడుతోంది. గురువారం ఉదయం 7 గంటల నుంచి శుక్రవారం ఉదయం 7 గంటల వరకు మరమ్మతు పనులు చేపడుతారు. పనులు పూర్తయిన తర్వాత సిటీలో మంచినీటి సరఫరాను పునరుద్దరిస్తామని జలమండలి ఒక ప్రకటనలో పేర్కొంది. ఆ ప్రాంతాల్లో ఉండే ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించింది.

ఇవి కూడా చదవండి...

CM Chandrababu: అమరావతిలో ఏ ఒక్కరికి అన్యాయం జరగనివ్వం: సీఎం చంద్రబాబు

Read Latest Telangana News AND Telugu News

Updated Date - Jul 03 , 2024 | 07:27 PM

Advertising
Advertising