ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Mahesh Cooperative Bank: మహేష్ కోపరేటివ్ బ్యాంకులో ముగిసిన ఈడీ సోదాలు

ABN, Publish Date - Aug 02 , 2024 | 11:07 AM

హైదరాబాద్: మహేష్‌ కో- ఆపరేటీవ్‌ బ్యాంకులో 300 కోట్ల రూపాయల స్కాంకు సంబంధించి హైదరాబాద్‌లో ఏడు చోట్ల ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చేసిన సోదాలు ముగిసాయి. సోదాల అనంతరం కోటి రూపాయల నగదు, 4 .27 కోట్ల బంగారం , 6 వేల రూపాయలు అమెరికన్ డాలర్లు , కీలక పత్రాలు బ్యాంకు లాకర్లు ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్: మహేష్‌ కో- ఆపరేటీవ్‌ బ్యాంకు (Mahesh Cooperative Bank)లో 300 కోట్ల రూపాయల స్కాం కు (300 crore rupees scam) సంబంధించి హైదరాబాద్‌లో ఏడు చోట్ల ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) చేసిన సోదాలు ముగిసాయి. సోదాల అనంతరం కోటి రూపాయల నగదు, 4 .27 కోట్ల బంగారం , 6 వేల రూపాయలు అమెరికన్ డాలర్లు , పలు కీలక పత్రాలు బ్యాంకు లాకర్లు ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చైర్మన్ రమేష్ కుమార్ బంగ్, చాంద్ అశ్వ, పురుషోత్తం దాస్ మందన తదితరుల నివాసాలపై కూడా ఈడీ అధికారులు సోదాలు చేశారు. లేని ఆస్తులను ఉన్నట్టుగా చూపించి వాటిని తనక పట్టి నిబంధనలకు విరుద్ధంగా మహేష్ బ్యాంక్ అధికారులు రుణాలు ఇచ్చారు.


రుణాలు పొందిన వారి దగ్గర నుంచి 10 శాతం కమిషన్ తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. రుణాలు పొందిన వారి ఖాతా నుంచి తిరిగి తమ ఖాతాలోకి నిర్వాహకులు నిధులు మళ్లించుకున్నారు. సుమారు1800 మందికి గోల్డ్ లోన్లు ఇచ్చి వారిని తమ బ్యాంకు ఓటర్లుగా చేర్చుకున్నారు. రెండు సంవత్సరాల క్రితం జరిగిన ఎన్నికల్లో సైతం అవకతవకలు జరిగినట్లు ఈడీ గుర్తించింది. బ్యాంకు నిధులను సైతం తప్పుదారి పట్టించారు. బిల్డింగ్ నిర్మాణం పేరుతో రూ.18 కోట్లు, తప్పుడు బిల్లులతో మరో రూ. 6 కోట్లు దారి మళ్లించినట్లు ఈడీ అధికారులు గుర్తించారు.


కాగా మహేష్‌ కో-ఆపరేటీవ్‌ బ్యాంకులో రూ.300 కోట్ల నిధుల గోల్‌మాల్‌కు సంబంధించిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మహేష్‌ కో-ఆపరేటీవ్‌ బ్యాంకు ప్రమోటర్ల ఇళ్లు, కార్యాలయాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) బుధవారం సోదాలు నిర్వహించింది. హైదరాబాద్‌లోని ఆరు వేర్వేరు ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ సోదాలు జరిగాయి. నకిలీ పత్రాలు సృష్టించడం, నిబంధనలకు విరుద్ధంగా రూ.300 కోట్లకుపైగా రుణాల మంజూరు, బ్యాంకు నుంచి రూ.18.30 కోట్లు దారి మళ్లింపు ఆరోపణలపై ఈడీ విచారణ చేస్తోంది.


ఇందులో భాగంగా బ్యాంకు చైర్మన్‌ రమేష్‌ కుమార్‌ బంగ్‌, వైస్‌ చైర్మన్‌ పురుషోత్తమదాస్‌, ఎండీ ఉమేష్‌ చంద్‌కు సంబంధించిన నివాస ప్రాంతాల్లో సోదాలు చేసిన ఈడీ బృందాలు పలు కీలక పత్రాలు, డిజిటల్‌ ఆధారాలను సేకరించాయి. ఈ సమాచారం ఆధారంగా నిధుల దారిమళ్లింపుతో సంబంధం ఉన్న వెంకట్‌, మరో ఇద్దరు వ్యక్తుల ఇళ్లు, కార్యాలయాల్లోనూ సోదాలు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Live..: 9వ రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..

నేడే జాబ్ క్యాలెండర్ ప్రకటన..

రిజిస్ట్రేషన్ శాఖలో జగన్ అక్రమాలు ..

మంత్రి నారా లోకేష్ సంచలన ట్వీట్..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Aug 02 , 2024 | 11:07 AM

Advertising
Advertising
<