ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ED: సాహితి ఇన్ ఫ్రా ఎండీని ప్రశ్నించనున్న ఈడీ

ABN, Publish Date - Oct 14 , 2024 | 10:49 AM

ప్రీలాంచ్‌ పేరుతో ఫ్లాట్లు నిర్మాణం చేసి ఇస్తామని చెప్పి పలువురు వినియోగదారుల నుంచి రూ. వేల కోట్లలో డబ్బులు వసూలు చేసినట్లు ఫిర్యాదులు రావడంతో ఎండీ లక్ష్మి నారాయణపై ఈడీ కేసు నమోదు చేసింది. రూ.2 కోట్లకుపైగా వసూలు చేసినట్లు సాహితీ గ్రూప్‌పై ఈడీ మనీలాండరింగ్‌ చట్టం కింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తోంది.

హైదరాబాద్: సాహితి ఇన్ ఫ్రా (Sahiti infra) పేరు మీద వేలమందితో కోట్లాది రూపాయలు వసూలు చేసిన ఎండీ లక్ష్మి నారాయణ (MD Lakshmi Narayana)ను సోమవారం నుంచి ఐదు రోజులపాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ) (ED) విచారించనుంది. పీఎంఎల్ఏ (PMLA) యాక్ట్ కింద సెప్టెంబర్ 29న లక్ష్మి నారాయణను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సాహితి ఇన్ ఫ్రా స్కాంలో ఇంకా ఎవరెవరి పాత్ర ఉందన్న దానిపై ఐదు రోజుల కస్టడీలో ఈడీ విచారించనుంది. ప్రీ లాంచ్ ఆఫర్లతో దాదాపు 1600 మంది కస్టమర్ల నుంచి 2 వేల కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు ప్రాథమికంగా విచారణ అధికారులు గుర్తించారు.


ప్రీలాంచ్‌ పేరుతో ఫ్లాట్లు నిర్మాణం చేసి ఇస్తామని చెప్పి పలువురు వినియోగదారుల నుంచి రూ. వేల కోట్లలో డబ్బులు వసూలు చేసినట్లు ఫిర్యాదులు రావడంతో ఎండీ లక్ష్మి నారాయణపై ఈడీ కేసు నమోదు చేసింది. రూ.2 కోట్లకుపైగా వసూలు చేసినట్లు సాహితీ గ్రూప్‌పై ఈడీ మనీలాండరింగ్‌ చట్టం కింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

ప్రీ-లాంచింగ్ పేరుతో వేల మంది నుంచి వేల కోట్ల రూపాయలు వసూలు చేసిన సాహితీ సంస్థ వారికి ప్లాట్లు అప్పగించకుండా మోసగించినట్లు ఆరోపణలున్నాయి. ఇదే విషయమై పోలీసులు 2022లో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. హైదరాబాద్ సెంట్రల్​ క్రైమ్​ స్టేషన్ పోలీసులు గతంలో లక్ష్మీనారయణను అరెస్టు చేసి, జైలుకు తరలించారు. ఈ వ్యవహారంలో మనీలాండరింగ్ జరిగిందనే కోణంలో కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టింది. ఈ క్రమంలోనే ఆయనను అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు హైదరాబాద్​లోని కార్యాలయంలో ఆయనను విచారించనున్నారు.


కాగా ఇదే వ్యవహారంలో గతంలోనూ లక్ష్మీనారయణను పోలీసులు అరెస్టు చేశారు. ప్రీలాంచ్‌ పేరుతు 2500 మంది కస్టమర్ల నుంచి పెద్దమొత్తంలో డబ్బులు కట్టించుకుని మోసం చేశారని 2022 ఆగస్టులో సాహితీ ఇన్‌ఫ్రాటెక్‌ వెంచర్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎండీ లక్ష్మీ నారాయణపై హైదరాబాద్‌ సీసీఎస్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు అదే ఏడాది డిసెంబర్‌ 2న ఎండీ లక్ష్మీ నారాయణను అరెస్ట్ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీలో ఐదు జిల్లాల్లో భారీ వర్షాలు..

గీసుగొండ వివాదంపై మంత్రి కొండా సురేఖ ఏమన్నారంటే..

తుపాను ప్రభావంతో భారీ వర్షాలు

రేపు దేశవ్యాప్తంగా వైద్యుల నిరాహార దీక్ష

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Oct 14 , 2024 | 10:49 AM