ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TG Govt.: ఉద్యోగుల సమయపాలనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

ABN, Publish Date - Dec 12 , 2024 | 12:33 PM

సచివాలయం ఉద్యోగుల అటెండెన్స్ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం నుంచి ఫేస్ రికగ్నిషన్‌ అటెండెన్స్‌ను తప్పనిసరి చేసింది. అందులో భాగంగా ఇప్పటికే సచివాలయంలోని అన్ని విభాగాల్లో ఫేస్ రికగ్నిషన్‌ డిజిటల్ మిషన్లను ఏర్పాటు చేసింది. ఉద్యోగులకుసంబంధించిన ఐడీ నెంబర్లతో సహా ఫేస్‌లను మిషన్‌లో అధికారులు నమోదు చేశారు.

హైదరాబాద్: తెలంగాణ సచివాలయం (Telangana Secretariat)లో గురువారం నుంచి ఫేషియల్ రికగ్నేషన్ అటెండెన్స్ (Facial Recognition Attendance) అమలులోకి వచ్చింది. మధ్యాహ్నం 12 గంటలు దాటినా కొందరు ఉద్యోగులు (Employees) విధులకు హాజరు కాకపోవడంపై మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఉద్యోగుల సమయపాలనపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఫేస్ రికగ్నిషన్‌కు సంబంధించి సీఎస్ శాంతి కుమారి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఇకపై ఫేషియల్ రికగ్నేషన్ విధానంపైనే రోజువారి అటెండెన్స్ నమోదు చేయనున్నారు. గురువారం నుంచి అన్ని శాఖల అధికారులు, సిబ్బందికి ఇది వర్తిస్తోంది.


సచివాలయం ఉద్యోగుల అటెండెన్స్ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం నుంచి ఫేస్ రికగ్నిషన్‌ అటెండెన్స్‌ను తప్పనిసరి చేసింది. అందులో భాగంగా ఇప్పటికే సచివాలయంలోని అన్ని విభాగాల్లో ఫేస్ రికగ్నిషన్‌ డిజిటల్ మిషన్లను ఏర్పాటు చేసింది. ఉద్యోగులకుసంబంధించిన ఐడీ నెంబర్లతో సహా ఫేస్‌లను మిషన్‌లో అధికారులు నమోదు చేశారు. గురువారం ఉదయం నుంచే ఉద్యోగులు తమ విధులకు హాజరయ్యే ముందు ఫేస్ రికగ్నిషన్‌ మిషన్‌లో తమ అటెండెన్స్ నమోదు చేసుకుని విధులకు హాజరవుతున్నారు. ఇక నుంచి ఉద్యోగుల అటెండెన్స్, వారి జీతభత్యాల చెల్లింపులు ఈ అటెండెన్స్ ద్వారానే జరుగుతుంది.


తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగుల అటెండెన్స్ విషయంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అందులో ప్రధానంగా రాష్ట్ర సచివాలయం పాలన విభాగానికి గుండెకాయ లాంటిది. అయితే కొంత మంది ఉద్యోగులు సమయానికి రావడంలేదని, ఇష్టానుసారంగా వస్తున్నారని, 12 గంటల వరకు కూడా కొంతమంది రావడం లేదని.. ఒక వేళ వచ్చినా.. సాయంత్రం 5 గంటలలోపే తిరిగి వెళ్లిపోతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్.. మంత్రులు కొందరు తమ శాఖల్లోని ఆకస్మిక తనిఖీలు చేశారు. ఉద్యోగులు సమయానికి రావడంలేదని తేలింది. అలా రాని ఉద్యోగుల నుంచి వివరణ తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని ఫేస్ రికగ్నిషన్‌ అటెండెన్స్ అమలులోకి తీసుకువచ్చింది. ఉద్యోగుల సమయపాలన సెక్రటేరియట్ భద్రతను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఫేస్ రికగ్నేషన్ అమలు నిర్ణయం తీసుకుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రానికి ఆక్సిజన్ ఇచ్చి నిలబెట్టాం

ఎందుకు రాజీనామా చేశానంటే..: అవంతి శ్రీనివాస్

ప్రేమ కోసం మతం మార్చుకున్నా.. అయినా..

ప్రపంచ రికార్డు సృష్టించిన ఎలాన్ మస్క్

‘స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్’...

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Dec 12 , 2024 | 12:51 PM