Love failure: ప్రేమ కోసం మతం మార్చుకున్నా.. అయినా.. ఓ యువతి ఆవేదన..
ABN, Publish Date - Dec 12 , 2024 | 11:13 AM
ప్రేమ కోసం మతం మార్చుకున్నా యువతిని శారీరకంగా వాడుకుని మోసం చేసిన ఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వైజాగ్ నుంచి వచ్చిన యువతి బ్యూటిషయన్‌గా సిర్థ పడింది. క్యాబ్ డ్రైవర్ ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. ప్రేమిస్తున్నానని నమ్మబలికి వాంఛలు తీర్చుకున్నాడు. పెళ్లి విషయం వచ్చేసరికి...
హైదరాబాద్: ప్రేమ (Love) పేరుతో కొందరు యువతులను పరిచయం చేసుకుని.. వారి జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ఇన్‌స్టాగ్రాం, చాటింగ్ (Instagram, Chatting)లతో మొదలుపెట్టి మాయమాటలు చెప్పి, ముగ్గులోకి దింపి అవసరం తీరాక మొహం చాటేస్తున్నారు. ఈ స్నేహం, ప్రేమ ముసుగులో జరుగుతున్న దారుణాన్ని తెలుసుకోలేక ఎందరో అమాయకులైన అమ్మాయిలు నిండా మునుగుతున్నారు. తల్లిదండ్రుల ప్రేమకంటే ముక్కు మొహం తెలియని వారి ప్రేమే ఎక్కువని యువతులు గుడ్డిగా నమ్మేస్తున్నారు.
అన్నీ కోల్పోయిన తర్వాతే కళ్లు తెరుస్తారు. అప్పుడు చేయడానికేమీ ఉండదు. జీవితంలో తప్పులు దిద్దుకోవడానికి కూడా ఉండదు. అలాంటి పరిస్థితే ఓ ప్రేమికురాలుకు ఎదురైంది. అతనికోసం మతం కూడ మార్చుకుంది. అయితే ఆ యువకుడు ఆ యువతిని నమ్మంచి మోసం చేశాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని మధురానగర్‌లో చోటుచేసుకుంది. చివరికి పోలీస్‌స్టేషన్ మెట్లెక్కి బోరున విలపిస్తూ జరిగిన మోసాన్ని తలుచుకుంటూ బాధపడుతోంది.
వివరాల్లోకి వెళితే..
ప్రేమ కోసం మతం మార్చుకున్నా యువతిని శారీరకంగా వాడుకుని మోసం చేసిన ఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వైజాగ్ నుంచి వచ్చిన యువతి బ్యూటిషయన్‌గా సిర్థ పడింది. క్యాబ్ డ్రైవర్ ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. ప్రేమిస్తున్నానని నమ్మబలికి వాంఛలు తీర్చుకున్నాడు. పెళ్లి విషయం వచ్చేసరికి మతం అడ్డు వస్తుందని సాకులు చెప్పడంతో ఆ యువతి మతం కూడా మార్చుకుంది. దీంతో కొన్నాళ్ళ పాటు యువతితో క్యాబ్ డ్రైవర్ సహజీవనం చేసి పరార్ అయ్యాడు. మోసపోయినట్లు గుర్తించిన యువతి . మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను శారీరకంగా వాడుకోవడంతో పాటు.. లక్షలాది రూపాయలు తీసుకుని పారిపోయాడని బాధిత యువతి ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసిన మధురానగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రపంచ రికార్డు సృష్టించిన ఎలాన్ మస్క్
‘స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్’...
కొల్లు రవీంద్ర సోదరుని మృతికి సీఎం చంద్రబాబు సంతాపం
జనం మెచ్చేలా! మనం నచ్చేలా పాలన
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Dec 12 , 2024 | 11:30 AM