ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Congress: కేసీఆర్ బై బై.. కాంగ్రెస్‌లోకి మల్లారెడ్డి! ప్రియాంక అపాయింట్మెంట్ కోరిన బీఆర్ఎస్ నేతలు

ABN, Publish Date - Mar 14 , 2024 | 02:37 PM

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు భారీ షాక్ తగలబోతోందా. అంటే అవుననే సంకేతాలు ఇస్తున్నాయి తాజా పరిణామాలు. పార్టీకి ఎంతో నమ్మిన బంటుగా ఉండే మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత మల్లారెడ్డి త్వరలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు.

హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు భారీ షాక్ తగలబోతోంది. పార్టీకి ఎంతో నమ్మిన బంటుగా ఉండే మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత మల్లారెడ్డి త్వరలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇప్పటికే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ని మల్లారెడ్డి, మరో నేత మర్రి రాజశేఖర్ రెడ్డి గురువారం కలిసినట్లు తెలుస్తోంది.

బెంగళూరులోని ఓ హోటళ్లో డీకే శివకుమార్‌తో మంతనాలు జరిపారు. కాంగ్రెస్‌లో చేరేందుకు ఇరువురు దాదాపు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో మల్లారెడ్డి కుటుంబ సభ్యులు శుక్రవారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అపాయింట్మెంట్ కోరారు. దీన్ని బట్టి అతి త్వరలోనే మల్లారెడ్డి కాంగ్రెస్‌లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత బీఆర్ఎస్ నేతలు వరుసగా కాంగ్రెస్, బీజేపీలోకి జంప్ అవుతున్నారు. దీంతో రానున్న లోక్ సభ ఎన్నికలనాటికి బీఆర్ఎస్ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతోంది.

Updated Date - Mar 14 , 2024 | 05:25 PM

Advertising
Advertising