ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TS News: ది కాంటినెంటల్ రిసార్ట్‌లో లిక్కర్ పార్టీపై ఎక్సైజ్ పోలీసుల ప్రకటన

ABN, Publish Date - Jul 31 , 2024 | 11:39 AM

Telangana: ‘‘ది కాంటినెంటల్’’ రిసార్ట్ లో లిక్కర్ పార్టీపై ఎక్సైజ్ పోలీసులు ప్రకటనను విడుదల చేశారు. రిసార్ట్‌లో లిక్కర్ పార్టీ నడుస్తుంది అన్న సమాచారంతో రైడ్స్ నిర్వహించామన్నారు. లిక్కర్ పార్టీ నిర్వహించిన సుధీర్ కుమార్, షేక్ సుభానిపై కేసు నమోదు చేశామని తెలిపారు. దాడుల్లో భాగంగా మొత్తం 11.2 లీటర్ల మద్యం, 7.15 లీటర్ల బీరు స్వాధీనం చేసుకున్నామన్నారు. 7

Excise Police

హైదరాబాద్, జూలై 31: ‘‘ది కాంటినెంటల్’’ రిసార్ట్‌లో లిక్కర్ పార్టీపై ఎక్సైజ్ పోలీసులు (Exice Police) ప్రకటనను విడుదల చేశారు. రిసార్ట్‌లో లిక్కర్ పార్టీ నడుస్తుంది అన్న సమాచారంతో రైడ్స్ నిర్వహించామన్నారు. లిక్కర్ పార్టీ నిర్వహించిన సుధీర్ కుమార్, షేక్ సుభానిపై కేసు నమోదు చేశామని తెలిపారు. దాడుల్లో భాగంగా మొత్తం 11.2 లీటర్ల మద్యం, 7.15 లీటర్ల బీరు స్వాధీనం చేసుకున్నామన్నారు. 750 ఎంఎల్ మూడు బాలంటైన్స్ విస్కీ బాటిల్స్, ఐదు అబ్సోలట్ సిట్రాన్ వోడ్కా బాటిల్స్ ఒక లీటర్ బ్లాక్ లేబుల్ విస్కీ , 11 బడ్‌వైజర్ బీర్ బాటిల్స్, 19 బ్రీజర్ సీసాలు ఒక ఖాళీ బాటిల్ బాలంటైన్ విస్కీ స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ పోలీసులు వెల్లడించారు.

Sabitha Indra Reddy: వరస అత్యాచార ఘటనలపై సబితా ఇంద్రారెడ్డి ఫైర్..


కాగా... బిగ్‌బాస్ ఫేమ్ మహబూబ్ బర్తడే సందర్భంగా ఘట్‌కేసర్‌ మండలం అంకుశాపూర్‌లోని కాంటినెంటల్ రిసార్ట్‌లో పార్టీ నిర్వహించారు. రిసార్ట్‌లో లిక్కర్ పార్టీ జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న ఎక్సైజ్ పోలీసులు అక్కడ మెరుపుదాడులకు దిగారు. అనుమతి లేకుండా పార్టీ నిర్వహించడంపై ఇద్దరిపై కేసు నమోదు చేశారు. పార్టీ ఆర్గనైజర్‌గా ఉన్న మహబూబ్ సోదరుడు సుభాన్ అలీ సుభాన్ అలీపై ఎక్సైజ్ అధికారులు కేసు నమోదు చేశారు. అలాగే రిసార్ట్ మేనేజర్ సుధీర్ కుమార్‌పై కూడా కేసు నమోదు అయ్యింది. పార్టీలో 20 మందికి పైగా యువతి యువకులు పాల్గొన్నారు. అలాగే పలువురు ప్రముఖులు కూడా ఈ పార్టీలో పాల్గొన్నట్లు సమాచారం. అనుమతి లేకుండా లిక్కర్ పార్టీ నిర్వహించడంతో ఘట్కేసర్ ఎక్సైజ్ పోలీస్ అధికారులు దాడులు నిర్వహించారు.


ఇవి కూడా చదవండి...

Madanapalle Incident: మదనపల్లె ఘటనలో కీలక పరిణామం.. ఆ ఎనిమిది కేసులు ఎవరిపైనో..!?

Pawankalyan: పవన్‌ సారూ.. మీరే దిక్కు!

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 31 , 2024 | 11:42 AM

Advertising
Advertising
<