ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Chicken Prices: నాన్‌వెజ్ ప్రియులకు అదిరిపోయే వార్త.. కేజీ చికెన్ రూ.100కే

ABN, Publish Date - Aug 09 , 2024 | 06:26 PM

అసలే శ్రావణమాసం నాన్‌వెజ్ అంటే ఆమడదూరం పారిపోతారు. డిమాండ్ తగ్గితే ధరలెలా దిగొస్తాయో తెలిపే ప్రత్యక్ష ఉదాహరణే ఇది. డిమాండ్ తగ్గడంతో చికెన్ ధరలు(Chicken Prices) భారీగా పడిపోయాయి.

హైదరాబాద్: అసలే శ్రావణమాసం నాన్‌వెజ్ అంటే ఆమడదూరం పారిపోతారు. డిమాండ్ తగ్గితే ధరలెలా దిగొస్తాయో తెలిపే ప్రత్యక్ష ఉదాహరణే ఇది. డిమాండ్ తగ్గడంతో చికెన్ ధరలు(Chicken Prices) భారీగా పడిపోయాయి. ఒకానొక సమయంలో కిలో రూ.300 వరకు వెళ్లిన చికెన్ ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. ఒకప్పుడు ధరలు పెరగడంతో చాలా మంది కేజీ చికెన్ బదులు అరకేజీతో సరిపెట్టుకున్నారు. అదీ కష్టమని భావించిన వారు ప్రత్యామ్నయం చూసుకున్నారు. కాగా.. ఇప్పుడు పరిస్థితులు మారాయి. పండుగలతో సంబంధం లేకుండా నాన్‌వెజ్ ఆరగించే వారికి చికెన్ ధరలు తగ్గడం ఊరటనిస్తోంది. వారం రోజులుగా చికెన్ ధరలు తగ్గుతున్నాయి. హైదరాబాద్(Hyderabad)​లోని చాలా ప్రాంతాల్లో కేజీ స్కిన్ లెస్ చికెన్ ధర.. రూ.150 నుంచి రూ.180 మధ్య లభిస్తోంది. లైవ్ కోడి అయితే కేజీ రూ.100 నుంచి రూ.120 మధ్యనే అమ్ముతున్నారు వ్యాపారులు.


శ్రావణ మాసం వల్లే చికెన్​ ధరలు దిగొస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే శ్రావణమాసం మొదలై 5 రోజులు పూర్తైంది. ఎక్కువ మంది ఈ మాసంలో మాంసం జోలికి వెళ్లరు. దాదాపు నెలపాటు సాగే శ్రావణమాసమంతా.. ఉపవాసలు, పూజలతో గడిపేస్తుంటారు. చికెన్ ధరలు తగ్గడానికి ఇది ఒక ప్రధాన కారణంగా తెలుస్తోంది. కోళ్ల ఫాంలలో కోళ్లను ఒక సమయం దాటిన తర్వాత ఉంచరు.

అలా ఉంచితే వాటికి దాణా వేస్తూ పెంచడం యజమానులకు కష్టతరం అవుతుంది.తద్వారా కొనుగోళ్లు పెద్దగా లేకపోయినా వాటిని చికెన్​సెంటర్లకు తరలిస్తారు. అందుకే ధరలు తగ్గుతాయని అంటున్నారు. శ్రావణమాసం చివరి వరకు చికెన్ ధరలు భారీగా పడిపోయే అవకాశం ఉందని వ్యాపారులు భావిస్తున్నారు. ఇక హైదరాబాద్‌లో కిలో మటన్ ప్రాంతాన్ని బట్టి కిలో రూ.700 నుంచి రూ.1000 వరకు అమ్ముతున్నారు.

Updated Date - Aug 09 , 2024 | 06:32 PM

Advertising
Advertising
<