ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

తాలు, తరుగు పేరిట దోపిడీ

ABN, Publish Date - Apr 13 , 2024 | 03:47 AM

వరి కొనుగోలు కేంద్రాల్లో తాలు, తరుగు పేరిట క్వింటాలుకు 5 నుంచి 8 కిలోలు కోత విధిస్తూ రైతులను దోచుకుంటున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ విమర్శించారు....

కల్లాల్లో దళారులు, మిల్లుల్లో వ్యాపారుల దగా: సంజయ్‌

సిరిసిల్ల, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి): వరి కొనుగోలు కేంద్రాల్లో తాలు, తరుగు పేరిట క్వింటాలుకు 5 నుంచి 8 కిలోలు కోత విధిస్తూ రైతులను దోచుకుంటున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ విమర్శించారు. జనగామలో క్వింటాల్‌ ధాన్యాన్ని రూ.1,500 నుంచి రూ.1,700కే కొనుగోలు చేస్తూ మద్దతు ధరకు గండికొడుతున్నా.. ప్రభుత్వం చోద్యం చూస్తోందన్నారు. కల్లాల్లో దళారులు, మిల్లుల్లో వ్యాపారులు అన్నదాతలను దోపిడీ చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం సంకెపల్లిలోని కొనుగోలు కేంద్రాన్ని సంజయ్‌ పరిశీలించారు. కరీంనగర్‌ జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క గింజ కొనలేదని, సిరిసిల్ల జిల్లాలో 259 కేంద్రాలు ప్రారంభించినా కొనుగోళ్లు అంతంత మాత్రంగానే ఉన్నాయన్నారు. వరికి రూ.500 బోనస్‌, రూ.2 లక్షల రుణమాఫీ, రూ.15 వేలు రైతు భరోసా, కౌలు రైతులకు పెట్టుబడి సాయం హామీలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు.

రేవంత్‌వి కల్లబొల్లి మాటలు: లక్ష్మణ్‌

తనపై కుట్రలు పన్నుతున్నారంటూ రేవంత్‌ కల్లబొల్లి మాటలు మాట్లాడుతున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ విమర్శించారు. ఆరు గ్యారెంటీల వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు సానుభూతి పొందేలా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.

Updated Date - Apr 13 , 2024 | 03:47 AM

Advertising
Advertising