Hyderabad: ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే కఠిన చర్యలే..
ABN, Publish Date - May 25 , 2024 | 12:53 PM
హైదరాబాద్ మే 25: ప్రజల ప్రాణాలతో చలగాటం ఆడితే కఠిన చర్యలు తప్పవని తెలంగాణ వైద్య మండలి హెచ్చరించింది. ఈ మేరకు హైదరాబాద్, మేడ్చల్ పరిధిలో పలు క్లినిక్‌లపై అధికారులు దాడులు నిర్వహించి నకిలీ వైద్యులపై కేసులు నమోదు చేశారు. అనుమతుల లేకుండా నిర్వహిస్తున్న పలు క్లినిక్‌లను సీజ్ చేశారు.

ఐడీపీఎల్, చింతల్, షాపూర్ నగర్‌లో అధికారులు దాడులు నిర్వహించారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేసి పేషెంట్లకు వైద్యం చేస్తున్న క్లినిక్‌లను గుర్తించి సీజ్ చేశారు. అదే క్లినిక్‌లలో డయాగ్నొస్టిక్ సెంటర్లు, మెడికల్ షాపులు ఏర్పాటు చేసి అందినకాడికి దోచుకుంటున్నట్లు పేర్కొన్నారు. సోదాల్లో 50మందికి పైగా నకిలీ డాక్టర్లు పట్టుపడడంతో అధికారులు ఖంగుతిన్నారు. యాంటీబయాటిక్స్ మందులను సైతం పేషెంట్లకు నకిలీ డాక్టర్లు అందిస్తున్నట్లు గుర్తించారు. పట్టుపడిన డాక్టర్లపై కేసులు నమోదు చేసినట్లు వైద్య శాఖ అధికారులు తెలిపారు. ఇలాంటి చర్యలకు పాల్పడి ప్రజల ప్రాణలతో చెలగాటమాడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇది కూడా చదవండి...
Chandrababu: కాంబోడియాలో చిక్కుకున్న యువతను కాపాడాలి: చంద్రబాబు
Updated Date - May 25 , 2024 | 12:54 PM