Fire Accidents: హైదరాబాద్‌లో మూడు చోట్ల అగ్ని ప్రమాదాలు..
ABN, Publish Date - Nov 01 , 2024 | 11:05 AM
హైదరాబాద్: భాగ్యనగరంలోని మూడు చోట్ల అగ్ని ప్రమాదాలు సంభవించాయి. కొంత మేర ఆస్తినష్టం సంభవించింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనల ప్రదేశాలకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
హైదరాబాద్: భాగ్యనగరంలోని మూడు చోట్ల అగ్ని ప్రమాదాలు (Fire Accidents) సంభవించాయి. కొంత మేర ఆస్తినష్టం సంభవించింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనల ప్రదేశాలకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. పోలీసులు (Police) కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనల వివరాలు.. సికింద్రాబాద్ మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలోని అర్పీ రోడ్డులోని ఓ గోదాంలో అగ్నిప్రమాదం సంభవించింది. దీపావళి పండుగ నేపథ్యంలో బాణా సంచా కాలుస్తున్న క్రమంలో నిప్పు రవ్వలు గోదాంపై పడడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రమేష్ ఎలక్ట్రికల్స్‌కు చెందిన గోదాంపైన మంటలు రావడంతో ఒక్కసారిగా స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. రమేష్ ఎలక్ట్రికల్స్ గోదాం పరిసర ప్రాంతాలలో నివాసాలు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది..అగ్ని ప్రమాదంలో గోదాంలోని ఎలక్ట్రిక్ వస్తువులు అగ్నికి ఆహుతవ్వగా కొంతమేర ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు.
మరొకటి, హైదరాబాద్, హిమాయత్ నగర్ స్ట్రీట్ నెంబర్ 18లో అగ్నిప్రమాదం జరిగింది. ఓ అపార్ట్‌మెంట్‌లోని నాల్గవ అంతస్తు ఫ్లాట్‌లో మంటలు చెలరేగాయి. ఉదయం ఫ్లాట్‌లో పూజలు చేసిన ఇంటి యజమాని బయటకు వెళ్లారు. ఆ సమయంలో బాల్కనీ డోర్‌ను తెరిచి వెళ్లారు. దీంతో ఒక్కసారిగా ఇంటి నుండి మంటలు చెలరేగడంతో భయాందోళనలకు గురైన అపార్ట్‌మెంట్ వాసులు పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటన ప్రదేశానికి చేరుకున్న వారు మంటలను ఆర్పి అదుపులోకి తీసుకువచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇంకొకటి.. కొండాపూర్‌లోని ఓ డంప్ యార్డులో మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటన ప్రదేశానికి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎం రేవంత్ రెడ్డిని వదిలి పెట్టను: కేటీఆర్
ఆ ప్రచారాన్ని నమ్మొద్దు: సీఎం సిద్ధరామయ్య
మంత్రి లోకేష్ అమెరికా పర్యటన సక్సెస్
శ్రీకాకుళం జిల్లాలో సిలిండర్ల పథకాన్ని ప్రారంభించనున్న సీఎం
అట్లాంటాలో నారా లోకేస్ రెడ్ బుక్ ప్రస్తావన..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Nov 01 , 2024 | 11:08 AM