ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Devara: తారక్ కటౌట్‌కు మంటలు

ABN, Publish Date - Sep 27 , 2024 | 02:24 PM

దేవర మూవీకి అభిమానుల నుంచి మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో గల సుదర్శన్ థియేటర్ వద్ద ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ కటౌట్‌కు ప్రమాదం జరిగింది.

Devara Movie

'మ్యాన్ ఆఫ్ ది మాసెస్' జూనియర్ ఎన్టీఆర్ తాజా చిత్రం దేవర భారీ అంచనాల మధ్య ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో నిన్న రాత్రి ఒంటి గంట‌కు ప్రీమియం షోలు ప్రారంభ‌మైన ఈ సినిమాకి ప్రేక్ష‌కుల నుంచి మిక్స్‌డ్ రెస్పాన్స్ వ‌స్తోంది. సాధారణంగా స్టార్ హీరోల సినిమా విడుదలైనప్పుడల్లా అభిమానులు థియేటర్ల వద్ద హంగామా చేస్తుంటారు. కానీ వారి మితిమీరిన ఉత్సాహం కొన్నిసార్లు థియేటర్లలో ప్రమాదాలకు దారి తీస్తుంది.


ఇలాంటి ఘటనే ఈ రోజు హైదరాబాద్‌లోని ఆర్టీసీ ఎక్స్ రోడ్‌లోని సుదర్శన్ 35MM థియేటర్‌ వద్ద చోటుచేసుకుంది. థియేటర్ ఆవరణలో అభిమానులు సంబరాలు చేసుకుంటుండగా, ఎన్టీఆర్ కటౌట్‌కు మంటలు అంటుకుని వెంటనే దగ్ధం కావడంతో కొద్దిసేపటికే భారీగా మంటలు చెలరేగాయి. అగ్నిమాపక శాఖ వెంటనే రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చింది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. కటౌట్‌పై ఉన్న పూలదండల మధ్య పటాకులు కాల్చడంతో మంటలు చెలరేగినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


ఆచార్య తర్వాత కొరటాల శివ నుంచి వచ్చిన చిత్రం కావడంతో ఫ్యాన్స్ ఈ సినిమాపై అందోళన చెందినప్పటికీ.. గతంలో ఎన్టీఆర్‌తో తెరకెక్కించిన జనతా గ్యారేజ్ హిట్ కొట్టడంతో అభిమానులు కాస్త ఆశలు పెట్టుకున్నారు. అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తొలి సారిగా తెలుగులోకి అడుగుపెట్టడంతో ఫ్యాన్స్‌లో ఆశలు మరింత పెరిగాయి. రూ. 300 కోట్లతో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ నెగిటివ్ రోల్ చేశాడు. వీరితో పాటు శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, ప్రకాష్ రాజ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Sep 27 , 2024 | 02:25 PM