Shanti Swaroop: మూగబోయిన తొలి తెలుగు న్యూస్ రీడర్ స్వరం..
ABN, Publish Date - Apr 05 , 2024 | 10:52 AM
Shanti Swaroop: ప్రముఖ న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ (Shanti Swaroop) కన్నుమూశారు. గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రెండురోజుల క్రితం ఆయనకు గుండెపోటు వచ్చింది. దాంతో కుటుంబ సభ్యులు ఆయన్ను యశోదా ఆస్పత్రిలో చేర్పించారు.
Shanti Swaroop: ప్రముఖ న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ (Shanti Swaroop) కన్నుమూశారు. గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రెండురోజుల క్రితం ఆయనకు గుండెపోటు వచ్చింది. దాంతో కుటుంబ సభ్యులు ఆయన్ను యశోదా ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు ఆయనకు చికిత్సనందించారు. దురదృష్టావశాత్తు చికిత్స పొందుతూనే ఆయన కన్నుమూశారు.
తెలుగులో తొలిసారి వార్తలు..
శాంతి స్వరూప్ తెలుగులో తొలిసారి వార్తలు చదివారు. తెలుగు తొలి న్యూస్ రీడర్‌గా చెరగని ముద్ర వేశారు. అంతేకాదు.. పదేళ్లపాటు టెలీప్రాంప్టర్ లేకుండా పేపర్ చూసి చెప్పేవారు. శాంతిస్వరూప్.. 1983 నవంబర్ నుంచి దూరదర్శన్‌లో వార్తలు చదివారు. 2011లో దూరదర్శన్‌లో పని చేసిన ఆయన.. ఆ తరువాత పదవీ విరమణ చేశారు. న్యూస్ రీడర్‌గా లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును కూడా శాంతిస్వరూప్ అందుకున్నారు.
ఇవికూడా చదవండి:
బీఆర్‌ఎస్ నేత వేధింపులు తాళలేక చిట్ ఫండ్స్ మేనేజర్ ఆత్మహత్యాయత్నం
ఏ పార్టీ సభ్యత్వం తీసుకున్నా.. మరుక్షణమే నా ఎంపీ సీటు పోతుంది
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
Updated Date - Apr 05 , 2024 | 11:02 AM