HarishRao: కాంగ్రెస్, బీజేపీతో పాటు గవర్నర్‌పై హరీష్ రావు ఫైర్.. ఏ విషయంలో అంటే?
ABN, Publish Date - Jan 26 , 2024 | 11:12 AM
Telangana: అధికార కాంగ్రెస్ పార్టీ, బీజేపీలపై మాజీ మంత్రి హరీష్‌రావు మరోసారి ఫైర్ అయ్యారు. ఎక్స్ వేదికగా ఇరు పార్టీలపై విరుచుకుపడ్డారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకం వ్యవహారంపై స్పందిస్తూ.. కాంగ్రెస్, బీజేపీల రహస్యమైత్రి మరోసారి బయటపడిందన్నారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంలో రెండు పార్టీల మధ్య ఉన్న అవగాహన బట్టబయలు అయిందన్నారు.
హైదరాబాద్, జనవరి 26: అధికార కాంగ్రెస్ పార్టీ (Congress), బీజేపీలపై (BJP) మాజీ మంత్రి హరీష్‌రావు (Former Minister Harish Rao) మరోసారి ఫైర్ అయ్యారు. ఎక్స్ వేదికగా ఇరు పార్టీలపై విరుచుకుపడ్డారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకం వ్యవహారంపై స్పందిస్తూ.. కాంగ్రెస్, బీజేపీల రహస్యమైత్రి మరోసారి బయటపడిందన్నారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంలో రెండు పార్టీల మధ్య ఉన్న అవగాహన బట్టబయలు అయిందన్నారు. బీజేపీ ఎజెండాకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government), కాంగ్రెస్ పార్టీకి మేలు చేసే విధంగా గవర్నర్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
రాజకీయ పార్టీల్లో కొనసాగుతున్నారనే కారణంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS Government)సిఫారసు చేసిన అభ్యర్థులను ఎమ్మెల్సీలుగా నియమించడానికి ఈ గవర్నర్ నిరాకరించారన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా ఓ రాజకీయ పార్టీ అధ్యక్షుడినే సిఫారసు చేస్తే గవర్నర్ ఆమోదించారన్నారు. ‘‘ఇది ద్వంద్వ నీతి కాదా ? కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా గవర్నర్ వ్యవహరించడం కాదా ? గతంలో కూడా క్రీడా, సాంస్కృతిక , విద్యా సామాజిక , సేవ రంగాల్లో కృషి చేసిన వారిని బీఆర్ఎస్ ప్రభుత్వం ఎమ్మెల్సీలుగా సిఫారసు చేసింది. అప్పుడు కూడా గవర్నర్ రాజకీయ కారణాలతో వాటిని ఆమోదించలేదు. మరి ఇప్పుడు ఎందుకు ఆమోదించారు?’’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ , బీజేపీ రెండు పార్టీలు ఒక్కటై బీఆర్ఎస్ పార్టీని అణగదొక్కాలని చూస్తున్నాయన్నారు. ఈ కుట్రలో గవర్నర్ స్వయంగా భాగస్వామి కావడం అత్యంత దురదృష్టకరమన్నారు. న్యాయ సూత్రాలు, రాజ్యాంగ సాంప్రదాయాలు అన్ని పార్టీలకు ఒకే రకంగా ఉండాలని.. కానీ బీఆర్ఎస్‌కు, కాంగ్రెస్‌కు తేడా చూపిస్తున్నారని హరీష్‌రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...
Updated Date - Jan 26 , 2024 | 11:12 AM