ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

KTR: రేవంత్ నిన్ను వదలను.. ఢిల్లీలో కేటీఆర్ సవాల్

ABN, Publish Date - Nov 12 , 2024 | 11:27 AM

Telangana: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఢిల్లీ వేదికగా మాజీమంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. అమృత్ పథకం అవినీతిపై కేంద్రానికి కేటీఆర్ ఫిర్యాదు చేశారు. మంగళవారం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మనోహర్ లాల్ కట్టర్‌ను కలిసిన కేటీఆర్.. ముఖ్యమంత్రిగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న రేవంత్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.

Former minister KTR

న్యూఢిల్లీ, నవంబర్ 12: ఢిల్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై (CM Revanth Reddy) బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (Former Minister KTR) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అమృత్ పథకం అవినీతిపై కేంద్రానికి కేటీఆర్ ఫిర్యాదు చేశారు. మంగళవారం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మనోహర్ లాల్ కట్టర్‌ను కలిసిన కేటీఆర్.. ముఖ్యమంత్రిగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.

TG News: ఆలయంలో ప్రదక్షణలు చేస్తుండగా హఠాత్తుగా..


చర్యలు ఎందుకు తీసుకోరు..

అనంతరం కేటీఆర్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ... రాహుల్ గాంధీ క్రోనీ క్యాపటలిజం, అవినీతి గురించి మాట్లాడుతున్నారని.. కొందరు పారిశ్రామికవేత్తలు అధికారవర్గానికి దగ్గరగా ఉండి లక్షల కోట్లు కొల్లగొడుతున్నారని ఆరోపిస్తున్నారు... కానీ కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణలో సరిగ్గా ఇలాగే జరుగుతోందని తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఏటీఎంలా మారిందని ప్రధాని అన్నారని చెప్పారు. అలాగే తెలంగాణలో RR (రాహుల్-రేవంత్) ట్యాక్స్ వసూలు చేస్తున్నారని కూడా ఆరోపించారన్నారు. ‘‘నేను ఆధారాలు తీసుకొచ్చి మీకు అందించాను. అయినా సరే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు’’ అని కేటీఆర్ ప్రశ్నించారు.


ఇటు బావమర్దికి.. అటు అల్లుడు కోసం

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వందల కోట్ల రూపాయల కాంట్రాక్ట్‌ను తన సొంత బామ్మర్దికి అప్పగించారని.. రేవంత్ రెడ్డి తన సొంత బామ్మర్దికి అమృత్ పంచి, అల్లుడి కోసం కొడంగల్‌లో ఫార్మా కంపెనీ పెడుతున్నారని.. ప్రజల నుంచి తిరుగుబాటు ఎదుర్కొంటున్నారని తెలిపారు. తెలంగాణలో ప్రజలను వంచించి ఎన్నికల హామీలు అమలు చేయకుండా మహారాష్ట్ర ఎన్నికల్లో రాహుల్ గాంధీ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ కాంగ్రెస్ కు ఏటీఎం లాగా మారిందని స్వయంగా ప్రధాని ఆరోపించారని.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దీనిపై ఎందుకు విచారణ జరపడం లేదని ప్రశ్నించారు. ఆఫీస్ ఆఫ్ ఫ్రాఫిట్ కింద పొంగులేటి శ్రీనివాసరెడ్డికి 4 వేల కోట్ల పనులు కట్టబెడుతున్నారని... దీనిపై కూడా కేంద్రం విచారణ జరపాలని డిమాండ్ చేశారు.


హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినేలా

పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిబంధనలు ఉల్లంఘించినందుకు పదవిని కోల్పోవాల్సి వస్తుందన్నారు. మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దుల్లో కేంద్ర ఎన్నికల సంఘం మరిన్ని చెక్ పోస్టులు పెట్టాలని... తెలంగాణ నుంచి మహారాష్ట్ర ఎన్నికలకు డబ్బులు వెళుతున్నాయని ఆరోపించారు. బీజేపీ ఎంపీలు ఒక్కరు కూడా తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎందుకు నోరు విప్పడం లేదని నిలదీశారు. రేవంత్ రెడ్డి అనుభవరాహిత్యం వల్ల తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు నాలుగు కార్పోరేషన్లుగా విభజించాలని చూస్తున్నారని కేటీఆర్ ఫైర్ అయ్యారు.


కాగా.. అధికార దుర్వినియోగం, అవినీతి నిరోధక చట్టాలను ఉపయోగించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రిని కేటీఆర్ కోరారు. అర్హత లేకపోయినా సీఎం బావమరిది శోధా కంపెనీకి రూ. 1,137 కోట్ల పనులు అప్పగించారని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రికి ఫిర్యాదు చేశారు. రేవంత్ రెడ్డి తన బావమరిదికి కేటాయించిన పనులపై పారదర్శకంగా విచారణ జరిపించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.


ఇవి కూడా చదవండి..

AP NEWS: వేట మొదలైంది.. సోషల్ మీడియా సైకోల భరతం పడుతున్న పోలీసులు

BRS: పాగల్ పాలనలో తెలంగాణ ఆగమైతుంది: కేటీఆర్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 12 , 2024 | 12:12 PM