ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

KTR: సిరిసిల్ల వస్త్ర పరిశ్రమపై సంక్షోభ వార్తలు.. కేటీఆర్ రియాక్షన్

ABN, Publish Date - Jan 16 , 2024 | 09:41 AM

Telangana: సిరిసిల్ల వస్త్ర పరిశ్రమపై వస్తున్న సంక్షోభ వార్తలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. వస్త్ర పరిశ్రమ సంక్షోభంలోకి వెళ్లకుండా గత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను కొనసాగిస్తూనే, కాంగ్రెస్ ప్రభుత్వం మరిన్ని కార్యక్రమాలు వెంటనే చేపట్టాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేశారు.

హైదరాబాద్, జనవరి 16: సిరిసిల్ల వస్త్ర పరిశ్రమపై వస్తున్న సంక్షోభ వార్తలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR) స్పందించారు. వస్త్ర పరిశ్రమ సంక్షోభంలోకి వెళ్లకుండా గత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను కొనసాగిస్తూనే, కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) మరిన్ని కార్యక్రమాలు వెంటనే చేపట్టాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేశారు. గత పది సంవత్సరాల్లో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ఎంతగానో అభివృద్ధి చెందిందని తెలిపారు. ఎంతో నైపుణ్యం కలిగిన పవర్లూమ్ నేతన్నలు, అభివృద్ధి చెందడమే కాకుండా తమ కార్యకలాపాలను విస్తరించారన్నారు. గత పది సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS Government) అందించిన సహకారమే ఇందుకు ప్రధాన కారణమని మాజీ మంత్రి చెప్పుకొచ్చారు.


కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పవర్లూమ్ వస్త్ర పరిశ్రమకు అండగా నిలవాలన్నారు. గత ప్రభుత్వం ప్రారంభించిన వివిధ కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఈ పరిశ్రమ బలోపేతానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ సహకారం ఉంటే తమిళనాడులో ఉన్న తిరుపూర్ వస్త్ర పరిశ్రమతో సమానంగా పోటీ పడగలిగే అవకాశాలు ఈ రంగానికి ఉన్నాయన్నారు. అయితే ఈ రంగానికి సంబంధించి గత 15 రోజులుగా వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించకుంటే ఈ పరిశ్రమ తీవ్రమైన సంక్షోభంలోకి వెళుతుందని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Jan 16 , 2024 | 09:42 AM

Advertising
Advertising