ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

KTR: ఫార్ములా ఈ రేస్‌పై రేవంత్‌కు కేటీఆర్ సవాల్...

ABN, Publish Date - Dec 18 , 2024 | 04:00 PM

Telangana: హైదరాబాద్‌కు మంచి జరగాలన్న ఉద్దేశంతో గత ప్రభుత్వం ఫార్ములా ఈ రేస్ నిర్వాహకులతో ఒప్పందం కుదుర్చుకుందని కేటీఆర్ తెలిపారు. కానీ రాజకీయ కక్షలకు బలి చేశారని మండిపడ్డారు. మొదటి దఫా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో విజయవంతంగా జరుగగా.. రెండో దఫాలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏకపక్షంగా రద్దు చేశారని మండిపడ్డారు.

BRS working President KTR

హైదరాబాద్, డిసెంబర్ 18: ఫార్యులా ఈ రేస్ వ్యవహారానికి సంబంధించి వస్తున్న ఆరోపణలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ రాసిన మాజీ మంత్రి.. దమ్ముంటే ఫార్ములా- ఈ రేస్ అంశంపై శాసనసభలో చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు. ఫార్మలా ఈ రేస్‌పై రకరకలా వార్తలు వస్తున్నాయని.. ముఖ్యంగా తన గురించి ఆరోపణలు వస్తున్నాయన్నారు. ఇటీవల జరిగిన కేబినెట్‌ భేటీలోనే ఈ అంశంపై చర్చ కూడా జరిగినట్లు తెలిసిందన్నారు. హైదరాబాద్‌కు మంచి జరగాలన్న ఉద్దేశంతో గత ప్రభుత్వం ఫార్ములా ఈ రేస్ నిర్వాహకులతో ఒప్పందం కుదుర్చుకుందన్నారు. కానీ రాజకీయ కక్షలకు బలి చేశారని మండిపడ్డారు. మొదటి దఫా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో విజయవంతంగా జరుగగా.. రెండో దఫాలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏకపక్షంగా రద్దు చేశారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలు నిజాలు తెలుసుకునే హక్కు ఉన్నందున ఈ అంశాలన్ని శాసనసభలో చర్చ పెట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

కీలక నియామకంపై మోదీతో రాహుల్, ఖర్గే భేటీ


కేటీఆర్ లేఖ ఇదే..

‘‘ఫార్ములా - ఈ రేస్ వ్యవహారంలో మీ ప్రభుత్వం కొన్ని నెలలుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం మీద, ముఖ్యంగా నా మీద అనేక నిరాధార అరోపణలు చేస్తోంది. ఇదే విషయం మీద ఈ వారం మీ ఆధ్వర్యంలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో గంటన్నర సేపు చర్చ కూడా జరిగినట్టు వార్తా కథనాలు వచ్చాయి. ఇదే అంశం మీద కేసులు నమోదు చేస్తామని, గవర్నర్ ఆమోదం వచ్చిందని రకరకాల లీకులు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి మీడియాకు ఇస్తున్నారు. ఈ అంశం మీద నాలుగు గోడల మధ్య చర్చ కన్నా రాష్ట్ర శాసనసభలో నాలుగు కోట్ల మంది ప్రజల ముందు చర్చ జరిగితే నిజానిజాలు ఏమిటో అందరికీ తెలుస్తాయి. తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి మంచి జరగాలనే సదుద్దేశంతో గత ప్రభుత్వం ఫార్ములా-ఈ రేస్ నిర్వాహకులతో ఒక ఒప్పందం చేసుకుంది. 2023లో విజయవంతంగా రేస్ జరిగి అన్ని వర్గాల మన్ననలు అందుకుంది. ఈ రేస్ వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సుమారు రూ.700 కోట్ల రూపాయల లబ్ది చేకూరింది అని నీల్సన్ సంస్థ నివేదిక స్పష్టం చేసింది’’ అని మాజీ మంత్రి అన్నారు.

అశ్విన్ రిటైర్మెంట్.. వాళ్లు సేఫ్


కచ్చితంగా ప్రజలకు తెలియాలి

‘‘2024లో మరో దఫా రేస్ జరగవలసి ఉండగా మీ ప్రభుత్వం వచ్చిన వెంటనే దాన్ని ఏకపక్షంగా రద్దు చేసింది. అప్పటి నుంచి రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఈ రేస్ గురించి అనేక అవాస్తవాలను మీడియా ద్వారా ప్రచారం చేసి, ఇందులో ఏదో జరిగింది అనే అపోహలు సృష్టించే ప్రయత్నం మీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోంది. నిజానికి ఫార్ములా-ఈ రేస్ ఒప్పందం అంతా పారదర్శకంగా జరిగింది. రేస్ నిర్వాహకులకు చెల్లింపులు కూడా పారదర్శకంగానే జరిగాయి అని ఇది వరకే నేను వివరంగా చెప్పాను. అయినా మీ ప్రభుత్వం మాత్రం దుష్ప్రచారం మానడం లేదు. రాష్ట్ర ప్రజలకు నిజాలేమిటో తెలుసుకునే హక్కు ఉంది. మీరు శాసనసభలో ఈ అంశంపై చర్చ పెట్టాలని నేను డిమాండ్ చేస్తున్నాను. అన్ని విషయాలు సవివరంగా రాష్ట్ర ప్రజలకు శాసనసభ వేదికగా చెబుదాం. శాసనసభ సెషన్ జరుగుతున్నందున మీకు అనుకూలమైన రోజే ఈ చర్చను పెట్టండి. మరోసారి చెబుతున్నాను. ఫార్ములా - ఈ అంశంలో ఎలాంటి అవకతవకలు కానీ, అవినీతి కానీ జరగలేదు. రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి మంచి చేసే ఈ రేసును కేవలం మీ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు బలి చేశారు. దీనిపైన శాసనసభలో సవివరమైన చర్చ జరిగితే నిజానిజాలేమిటో నిగ్గుతేలుతాయి’’ అంటూ కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

వాళ్ల పెన్షన్లు రద్దు.. నోటీసులు జారీ

TG Assembly: అసెంబ్లీలో భూభారతి 2024 బిల్లు.. ప్రతిపక్షాల అభ్యంతరం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Dec 18 , 2024 | 04:02 PM