ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

KCR: ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణస్వీకారం నేడు.. అనంతరం నేరుగా..

ABN, Publish Date - Feb 01 , 2024 | 08:12 AM

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇవాళ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇవాళ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 12.45 నిమిషాలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఛాంబర్ లో ప్రమాణ స్వీకారం చేస్తారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్, కామారెడ్డిల నుంచి పోటీ చేసిన కేసీఆర్.. గజ్వేల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రమాణ స్వీకారం సందర్భంగా మధ్యాహ్నం 12 గంటలకు నేరుగా అసెంబ్లీలోని ఎల్ఓపీ కార్యాలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం ఎల్ఓపీ నేతగా భాద్యతలు స్వీకరించనున్నారు.

ఈ మేరకు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఅర్ ఆహ్వానించారు. కాగా.. కొద్ది రోజుల క్రితం ఫాంహౌస్‌‌ బాత్రూమ్‌‌లో కేసీఆర్ జారి పడ్డారు. దీంతో ఆయన తుంటి ఎముక విరిగడంతో వైద్యులు శస్త్రచికిత్స చేశారు. కొద్దిరోజులు ఆస్పత్రిలో చికిత్స పొంది ఆ తరువాత డిశ్చార్జ్ అయ్యారు. అనారోగ్యం కారణంగా ఇప్పటి వరకు కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయలేదు. .

"మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి."

Updated Date - Feb 01 , 2024 | 08:12 AM

Advertising
Advertising