ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

High Court: దుర్గం చెరువు వాసులకు గుడ్ న్యూస్..

ABN, Publish Date - Sep 23 , 2024 | 01:55 PM

అక్టోబర్ 4న లేక్ ప్రొటెక్షన్ కమిటీ ముందు దుర్గం చెరువు నిర్వాసితులు హాజరవుతారని, వారి అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని అక్టోబర్ 4 నుంచి ఆరు వారాలలోపు ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేయాలని లేక్ ప్రొటెక్షన్ కమిటీకి హైకోర్టు ఆదేశించింది.

హైదరాబాద్: దుర్గం చెరువు (Durgam pond) పరిసర ప్రాంతాల్లో నివాసితులకు హైకోర్టులో (High Court) ఊరట (Relief) లభించింది. దుర్గం చెరువు పరిసర ప్రాంతాల్లో కూల్చివేతలపై (Demolition) న్యాయస్థానం స్టే (Stay) ఇచ్చింది. అలాగే అక్టోబర్ 4 వ తేదీన లేక్ ప్రోటక్షన్ (Lake Protection) ముందు హాజరు కావాలని నిర్వాసితులకు ఆదేశించింది. 2014లో జారీ చేసిన ప్రిలిమినరీ నోటిఫికేషన్‌పై దుర్గం చెరువు నిర్వాసితులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీంతో నిర్వాసితుల అబ్జెక్షన్స్‌పై లేక్ ప్రొటెక్షన్ కమిటీ పరిగణలోకి తీసుకోవాలని, అక్టోబర్ 4న లేక్ ప్రొటెక్షన్ కమిటీ ముందు దుర్గం చెరువు నిర్వాసితులు హాజరవుతారని, వారి అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని అక్టోబర్ 4 నుంచి ఆరు వారాలలోపు ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేయాలని లేక్ ప్రొటెక్షన్ కమిటీకి హైకోర్టు ఆదేశించింది.


కాగా జెట్ స్పీడ్‌లో హైడ్రా బుల్డోజర్లు దూసుకెళ్తున్నాయి. జూన్ 26 నుంచి కూల్చివేతలు మొదలు పెట్టింది. ఇప్పటి వరకు 30 ప్రాంతాల్లో 300 ఆక్రమణలను కూల్చి వేసింది. ఆక్రమణలకు గురైన 120 ఎకరాలను ప్రభుత్వానికి అప్పగించింది. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను కబ్జా చేస్తూ బహుళ అంతస్తుల నిర్మాణాలపై ఫిర్యాదులు రావడంతో చెరువును హైడ్రా కమిషనర్ రంగనాధ్ పరిశీలిస్తున్నారు. వెంటనే రంగంలోకి దిగి హైడ్రా సిబ్బంది కూల్చివేస్తున్నారు. హై రీచ్ జా క్రషర్స్‌తో పాటు జేసీబీలతో, బుల్డోజర్లతో కూల్చి వేతలు చేపట్టారు. జీహెచ్ఎంసీతో పాటు ఓఆర్ఆర్ లోపల ఉన్న 27 మున్సిపాలిటీలు, 33 గ్రామాల్లో హైడ్రా దూకుడు పెంచింది.


కాగా హైడ్రా రికార్డు క్రియేట్ (Hydra Record) సృష్టించింది. అమీన్ పూర్‌లో హైడ్రా బిగ్ ఆపరేషన్ (Big Operation) చేపట్టింది. 17 గంటలపాటు నాన్ స్టాప్‌ (Non Stop)గా ఇళ్లులు, భవనాలు, అపార్టుమెట్లు కూల్చివేసింది. అలాగే ఓ హాస్పిటల్, రెండు అపార్ట్ మెంట్లు కూల్చివేసి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది. పటేల్ గుడాలో 16 విల్లాలు కూల్చివేసింది. సోమవారం తెల్లవారుజాము ఒంటిగంట వరకు కూల్చివేతలు కొనసాగాయి. హైడ్రా ఏర్పాటు తర్వాత తొలిసారిగా డే అండ్ నైట్ కూల్చివేతలు జరిగాయి. అక్రమ నిర్మాణాలకు అనుకొని ఉన్న పక్క ఇళ్లకు డ్యామేజ్ కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. హైడ్రా 17 గంటలపాటు హైరిస్క్ ఆపరేషన్ కొనసాగించి రికార్డు క్రియేట్ చేసింది.


కాగా గణేశ్‌ నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో రెండు వారాలపాటు కూల్చివేతలకు తాత్కాలిక విరామం ప్రకటించిన హైడ్రా.. తిరిగి తన పనిని మొదలుపెట్టింది. చెరువులు, ప్రభుత్వ స్థలాల్లోని అక్రమ నిర్మాణాలపై మరోసారి కొరడా ఝుళిపించింది. ఏకకాలంలో కూకట్‌పల్లిలో, అమీన్‌పూర్‌ మునిసిపాలిటీలోని కిష్టారెడ్డిపేట, పటేల్‌గూడలో ప్రభుత్వ భూముల్లోని నిర్మాణాలను నేలమట్టం చేసింది. కూకట్‌పల్లి శాంతినగర్‌లోని నల్లచెరువు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌ పరిధిలో నాలుగు ఎకరాల విస్తీర్ణంలో, కిష్టారెడ్డిపేటలోని ఎకరంపైగా, పటేల్‌గూడలోని మూడు ఎకరాలకుపైగా విస్తీర్ణంలోని నిర్మాణాలను కూల్చివేసింది.

రెవెన్యూ, నీటి పారుదల, పట్టణ ప్రణాళిక విభాగం అధికారులతో కలిసి హైడ్రా బృందం కూల్చివేతలు చేపట్టింది. మూడు ప్రాంతాల్లోని 8 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆక్రమణలు, భవనాలు తొలగించినట్టు హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ తెలిపారు. అయితే తమ సామాన్లను కూడా తీసుకునే సమయం ఇవ్వకుండా నిర్మాణాలు నేలమట్టం చేశారని బాధితులు లబోదిబోమన్నారు. అప్పులు చేసి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే తాము హైడ్రా చర్యతో రూ.లక్షల్లో నష్టపోయి రోడ్డున పడ్డాయని ఆవేదన చెందారు.

Updated Date - Sep 23 , 2024 | 02:03 PM