ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TS Politics: సీఎం రేవంత్‌ అందుకే విషం చిమ్ముతున్నారు: హరీష్ రావు

ABN, Publish Date - Feb 04 , 2024 | 09:31 PM

సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేఆర్ఎంబీ(KRMB)కు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టుల అప్పగించడంతో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని మండిపడ్డారు.

హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేఆర్ఎంబీ(KRMB)కు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టులను అప్పగించడంతో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని మండిపడ్డారు. తెలంగాణలో ప్రాజెక్టులను కేఆర్ఎంబీ(KRMB)కు అప్పగించింది ముమ్మాటికీ కాంగ్రెస్సే అని అన్నారు. రేవంత్‌కు విషయం తెలియకుండా విషం చిమ్ముతున్నాడని ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... కేసీఆర్ ఏనాడూ కూడా ఆ ప్రాజెక్టులను కేఆర్ఎంబీకు అప్పగించలేదని తేల్చిచెప్పారు.

కాంగ్రెస్ ఆ బిల్లు తీసుకురాలేదా..?

నీటి ప్రాజెక్టులను అప్పనంగా కేఆర్ఎంబీకు అప్పగించింది కాంగ్రెస్ అని చెప్పారు. రేవంత్ రెడ్డికి అవగాహన లేకుండా విమర్శలు చేస్తున్నారన్నారు. కేఆర్ఎంబీకు అప్పగించాలని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లు పెట్టిందని గుర్తుచేశారు. జైపాల్ రెడ్డి, జైరాం రమేష్ వీరిద్దరూ కూడా బిల్లు తీసుకొచ్చారన్నారు. రేవంత్ రెడ్డి అతి తెలివి బంద్ చేయాలని హెచ్చరించారు. కేఆర్ఎంబీకు అప్పగించడం వల్ల హైదరాబాద్ తాగు నీరు, ఖమ్మం, నల్లగొండకు సాగు నీరు రావడం కష్టమైందని తెలిపారు. పోతిరెడ్డిపాడుపై రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదని.. ఇప్పుడు మాట్లాడడం విస్మయాన్ని కలిగిస్తోందన్నారు. అసెంబ్లీలో నీటి సమస్యలపై చర్చించడానికి తాము సిద్ధమేనని హరీశ్ రావు సీఎం రేవంత్‌కు సవాల్ విసిరారు.

Updated Date - Feb 04 , 2024 | 09:42 PM

Advertising
Advertising