ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Rains Alert: హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం.. పలు ప్రాంతాలు జలమయం

ABN, Publish Date - Aug 20 , 2024 | 06:33 AM

హైదరాబాద్‌లో నిన్నటి నుంచి వర్షం దంచికొడుతునే ఉంది. భారీ వర్షంతో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాగల రెండు గంటలపాటు నగర వ్యాప్తంగా కుండపోత వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Rain In Hyderabad

హైదరాబాద్: హైదరాబాద్‌లో నిన్నటి నుంచి వర్షం దంచికొడుతునే ఉంది. భారీ వర్షంతో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాగల రెండు గంటలపాటు నగర వ్యాప్తంగా కుండపోత వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. భాగ్యనగరానికి జీహెచ్ఎంసీ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. చాలాచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కాగా, హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి.

అంధకారంలో భాగ్యనగరం..

సిటీలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్‌పేట్, సోమాజిగూడ, ఫిలింనగర్, షేక్‌పేట్, మెహిదీపట్నం, సనత్ నగర్, కూకట్‌పల్లి, మూసాపేట్, నాంపల్లి, ట్యాంక్‌బండ్, ముషీరాబాద్, చిక్కడపల్లి , రాంనగర్, అశోక్ నగర్, మలక్‌పేట, దిల్‌సుఖ్‌నగర్, చైతన్యపురి, కొత్తపేట, LB నగర్, హయత్‌నగర్, సికింద్రాబాద్, రసూల్‌పురా, బోయిన్‌పల్లి, మేడ్చల్, కుత్బుల్లాపూర్, చింతల్, ఉప్పల్, హబ్సిగూడ, తార్నాక, మల్కాజిగిరిలో భారీ వర్షం కురుస్తోంది. వర్షం ధాటికి పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో భాగ్యనగరం అంధకారంలో నెలకొంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బల్దియా హెచ్చరించింది. ఈరోజు కూడా భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు.


ట్రాఫిక్ జాం..

వర్షం ధాటికి భారీగా ట్రాఫిక్ జాం నెలకొంది. ప్రధాన రహదారులు జలమయం అయ్యాయి. వర్షపు నీరు మోకాళ్ల లోతులో నిలిచిపోయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ మళ్లించేందుకు పోలీసులు చర్యలు చేపడుతున్నారు.

GHMC డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి.అనవసరంగా ఎవ్వరు బయటకు రావద్దని జీహెచ్ఎంసీ హెచ్చరికలు జారీ చేసింది. అత్యవసరమైన వారు ఈ టోల్ ఫ్రీ నెంబర్లలో 040-21111111, 9000113667 సంప్రదించాలని జీహెచ్ఎంసీ అధికారులు కోరారు.


మూడు రోజుల పాటు భారీ వర్షాలు..

మరోవైపు.. రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుల కూడిన వానలు పడతాయని వెల్లడించింది. ఆగస్ట్ 20వ తేదీ వరకు తెలంగాణలోని అత్యధిక జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఎల్లో అలర్ట్ జారీ చేసిన విషయం విధితమే.

Updated Date - Aug 20 , 2024 | 07:12 AM

Advertising
Advertising
<