ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Heavy Rains: భారీ వర్షాలతో తెలంగాణ ఏ రేంజ్‌లో నష్టం జరిగిందంటే?

ABN, Publish Date - Sep 06 , 2024 | 11:02 AM

Telangana: భారీ వర్షాలు తెలంగాణను ముంచెత్తాయి. కుండపోత వర్షాలకు రాష్ట్రంలోని పలు జిల్లాలు వరద ముంపునకు గురయ్యాయి. వాగులు, వంకలు పొంగి పొర్లాయి. అనేక ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. ముంపు ప్రాంతాల్లో ప్రజల పరిస్థితి వర్ణణాతీతం. వరదలకు ఎంతో మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. పంటల పొలాలు నీటమునిగి తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి.

Heavy rains caused heavy damage to Telangana

హైదరాబాద్, సెప్టెంబర్ 6: భారీ వర్షాలు (Heavy Rains) తెలంగాణను (Telangana) ముంచెత్తాయి. కుండపోత వర్షాలకు రాష్ట్రంలోని పలు జిల్లాలు వరద ముంపునకు గురయ్యాయి. వాగులు, వంకలు పొంగి పొర్లాయి. అనేక ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. ముంపు ప్రాంతాల్లో ప్రజల పరిస్థితి వర్ణణాతీతం. వరదలకు ఎంతో మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. పంటల పొలాలు నీటమునిగి తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా భారీగా నష్టం వాటిల్లింది.

Lord Vinayaka: వినాయకుడి విగ్రహాన్ని ఏ సమయంలో ప్రతిష్టించాలి


గడిచిన వారం రోజుల క్రితం కురిసిన వర్షానికి ఉమ్మడి ఖమ్మం , నల్గొండ, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో భారీగా పంట నష్టం జరిగింది. వర్షాల కారణంగా ఇరవై మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వర్షాలు, వరదకు వరద బాధితులు సర్వం కోల్పోయిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుటికే వరద వల్ల చనిపోయిన కుటుంబాలకు ఐదు లక్షల ఎక్స్ గ్రేషియాతో పాటు పంటకు పది వేల ఆర్థిక సహాయం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని ఈనెల 1న మోడీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ రాశారు. ఇవాళ రాష్ట్రానికి కేంద్ర మంత్రులు శివ రాజ్ సింగ్ చౌహన్, బండి సంజయ్‌లు రానున్నారు. ఉదయం ఖమ్మం జిల్లాలో కేంద్రమంత్రులు పర్యటించనున్నారు. నేరుగా వరద బాధితులతో ముఖాముఖీ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం తరువాత సచివాలయంలో ముఖ్యమంత్రితో రేవంత్‌తో కేంద్ర మంత్రులు భేటీ అవుతారు. వరదల వల్ల దాదాపు వేల కోట్ల వరకు నష్టం వాటిల్లిందని ప్రాథమిక అంచనాకు వచ్చింది.

KCR: కేసీఆర్‌కు మరోసారి కోర్టు సమన్లు


కేంద్రమంత్రుల పర్యటన..

తెలంగాణలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో శుక్రవారం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ పర్యటించనున్నారు. శుక్రవారం ఉదయం కేంద్ర మంత్రులు ఖమ్మంలో పర్యటిస్తారు. తొలుత ఖమ్మం జిల్లాలో ఏరియల్‌ సర్వే ద్వారా వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటలకు కోదాడకు బండి సంజయ్‌ వెళ్లి అక్కడి వరద బాధితులను సమస్యలు అడిగి తెలుసుకుంటారు. పార్టీ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు తదితరులు సంజయ్‌తో పాటు వరద ప్రాంతాల్లో పర్యటిస్తారు. ఎంపీ ఈటల రాజేందర్‌ నేతృత్వంలో, పార్టీ నాయకులు ములుగు, మహబూబాబాద్‌ ప్రాంతాల్లో వరద బాధితులను పరామర్శిస్తారు. అలాగే కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఏపీలోని వరద ప్రభావిత ప్రాంతాల్లోనూ పర్యటించనున్నారు. ఏపీలో విజయవాడ పరిసర ప్రాంతాల్లోని వరద ప్రభావిత ప్రాంత రైతులతో కేంద్ర మంత్రి ఈరోజు చర్చించనున్నారు.


ఇవి కూడా చదవండి...

BRS: బీఆర్ఎస్‌లో విషాదం.. తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా కన్నుమూత

Rain Effect: వరద బీభత్సానికి దెబ్బతిన్న వేలాది కార్లు.. గగ్గోలు పెడుతున్న వాహనదారులు..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 06 , 2024 | 11:07 AM

Advertising
Advertising