ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hero Sundeep Kishan: వివాహ భోజనంబు రెస్టారెంట్‌లో రైడ్స్

ABN, Publish Date - Jul 10 , 2024 | 06:08 PM

టాలీవుడ్ హీరో సందీప్ కిషన్‌ రెస్టారెంట్ 'వివాహ భోజనంబు' రెస్టారెంట్‌లో ఫుడ్ సేప్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సికింద్రాబాద్‌లో గల రెస్టారెంట్‌‌ను అధికారులు నిశీతంగా పరిశీలించారు. ఎక్స్‌పైరీ డేట్ అయిపోయిన 25 కేజీల చిట్టిముత్యాల బియ్యం, నాసిరకం ఆహార పదార్థాలను గుర్తించారు. వండిన ఆహార పదార్థాలు నిల్వ చేసి ఫ్రీజ్‌లో పెట్టడాన్ని గుర్తించారు.

Hero Sundeep Kishan

హైదరాబాద్: టాలీవుడ్ హీరో సందీప్ కిషన్‌ (Sundeep Kishan) రెస్టారెంట్ 'వివాహ భోజనంబు' రెస్టారెంట్‌లో ఫుడ్ సేప్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సికింద్రాబాద్‌లో గల రెస్టారెంట్‌‌ను అధికారులు నిశీతంగా పరిశీలించారు. ఎక్స్‌పైరీ డేట్ అయిపోయిన 25 కేజీల చిట్టిముత్యాల బియ్యం, నాసిరకం ఆహార పదార్థాలను గుర్తించారు. వండిన ఆహార పదార్థాలు నిల్వ చేసి ఫ్రీజ్‌లో పెట్టడాన్ని గుర్తించారు. ఆహారం తయారు చేసేందుకు వాడుతున్న నీటిని పరిశీలించారు. కిచెన్‌లో పరిశుభ్రత పాటించలేదు. సింథటిక్ ఫుడ్ కలర్స్ కలిపిన కొబ్బెరను గుర్తించారు. తయారు చేసిన ఫుడ్ ఎక్స్‌పైరీ డేట్ లేకుండా ఉంచడం చూసి షాకయ్యారు. ఫుడ్ ప్రిపేర్ చేసే వారి హెల్త్‌కు సంబంధించి మెడికల్ రిపోర్ట్స్ లేవని తెలిపారు. వంట పాత్రలు క్లీన్ చేసిన నీరు అక్కడే నిల్వ ఉండడం చూసి నిర్వాహకులను అడిగారు. భారత ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ (FSSAI) అధికారులు వివాహ భోజనంబు రెస్టారెంట్‌కు నోటీసులు ఇచ్చారు. వివాహ భోజనంబు రెస్టారెంట్ వివరాలు, అక్కడ ఉపయోగించే ఆహార వివరాలను సోషల్ మీడియా ఎక్స్‌లో జీహెచ్ఎంసీ అధికారులు పోస్ట్ చేశారు.


రెస్టారెంట్‌లో స్టీల్ కంటైనర్లలో నిల్వ చేసిన పదార్థాలు కనిపించాయి. సరైన లేబులింగ్ కూడా లేదు. కొన్ని డస్ట్‌బిన్‌లు మూతలు లేకుండా కనిపించాయి. వంటగదిలో నీరు నిలిచిపోవడం గమనించారు. ప్రాంగణానికి పెస్ట్ కంట్రోల్ రికార్డ్‌లు మాత్రం తాజాగా ఉన్నాయి. కస్టమర్ల ఆరోగ్యం, భద్రతను నిర్ధారించడానికి సమస్యలను వెంటనే పరిష్కరించాలని వివాహ భోజనంబు నిర్వహకులను అధికారులు ఆదేశించారు.

Updated Date - Jul 10 , 2024 | 06:15 PM

Advertising
Advertising
<