TG High Court: జంతు వధ ఆపాలంటూ పోలీసులకు తెలంగాణ హైకోర్టు ఆదేశం..
ABN, Publish Date - Jun 13 , 2024 | 07:01 PM
బక్రీద్ పండగ (Bakrid festival) సందర్భంగా గోవధ జరగకుండా చూడాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు(Telangana High Court) ఆదేశించింది. ఈ మేరకు గోవులను తరలించకుండా తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది.
హైకోర్టు: బక్రీద్ పండగ(Bakrid festival) సందర్భంగా గోవధ జరగకుండా చూడాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు (Telangana High Court) ఆదేశించింది. ఈ మేరకు గోవులను తరలించకుండా తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. జంతు వధ చట్టం పటిష్ఠంగా అమలు చేస్తున్నట్లు హైకోర్టుకు ప్రభుత్వ తరఫు న్యాయవాది తెలిపారు. మూడు కమిషనరేట్ల పరిధిలో 150చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఇప్పటికే గోవుల తరలింపుపై 60 కేసులు నమోదు చేసినట్లు హైకోర్టుకు న్యాయవాది తెలిపారు. ఎవరైనా జంతువుల అక్రమ వధకు పాల్పడితే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
ఇది కూడా చదవండి:
Kaleshwaram: జస్టిస్ పీసీ ఘోష్‌ను కలిసిన హైడ్రాలజీ, నిపుణుల కమిటీ ఇంజినీర్లు..
Updated Date - Jun 13 , 2024 | 07:01 PM