ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TS NEWS: మేడిగడ్డ బ్యారేజ్‌పై జ్యుడీషియల్ విచారణ కోరిన ప్రభుత్వం

ABN, Publish Date - Mar 04 , 2024 | 09:18 PM

మేడిగడ్డ బ్యారేజ్(Medigadda Barrage) వ్యవహారంపై హైకోర్టు సోమవారం నాడు విచారణ చేపట్టింది. బ్యారేజ్ కుంగడంపై జుడిషియల్ విచారణను ప్రభుత్వం కోరింది. సుప్రీంకోర్టు లేదా హైకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలని ప్రభుత్వం కోరింది.

హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజ్(Medigadda Barrage) వ్యవహారంపై హైకోర్టు సోమవారం నాడు విచారణ చేపట్టింది. బ్యారేజ్ కుంగడంపై జ్యుడీషియల్ విచారణను ప్రభుత్వం కోరింది. సుప్రీంకోర్టు లేదా హైకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలని ప్రభుత్వం కోరింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇప్పటికే విజిలెన్స్ ఎంక్వయిరీకి ఆదేశించినట్టు ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. విజిలెన్స్ రిపోర్ట్ తర్వాత ఇంజనీర్లను విధుల నుంచి తొలగించినట్లు ప్రభుత్వ న్యాయవాది చెప్పారు.

మేడిగడ్డ బ్యారేజ్ కుంగడానికి కారణమైన అధికారులపై ఫైనల్ రిపోర్ట్ వచ్చాక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ ఘటనపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి లేఖ రాసిందని చెప్పారు. డ్యాం సేఫ్టీ అథారిటీ ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసిందని అన్నారు. సెంట్రల్ వాటర్ కమిషన్‌ను ఇంప్లీడ్ చేయాలని పిటిషనర్‌కు హై కోర్టు ఆదేశించింది.తదుపరి విచారణను హైకోర్టు 4 వారాలకు వాయిదా వేసింది.

Updated Date - Mar 04 , 2024 | 09:20 PM

Advertising
Advertising