TG Highcourt: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై నేడు హైకోర్టు తీర్పు
ABN, Publish Date - Sep 09 , 2024 | 11:06 AM
Telangana: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఈరోజు (సోమవారం) హైకోర్టు తీర్పును వెల్లడించనుంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా స్పీకర్‌ను ఆదేశించాలని హైకోర్టును బీఆర్‌ఎస్ ఆశ్రయించింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటు వేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
హైదరాబాద్, సెప్టెంబర్ 9: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఈరోజు (సోమవారం) హైకోర్టు (Telangana Highcourt) తీర్పును వెల్లడించనుంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై (MLAs) అనర్హత వేటు వేసేలా స్పీకర్‌ను ఆదేశించాలని హైకోర్టును బీఆర్‌ఎస్ (BRS) ఆశ్రయించింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (Khairatabad MLA Danam Nagender), స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Station Ghanpur MLA Kadiam Srihari), భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుపై (Bhadrachalam MLA Tellam Venkatrau) అనర్హత వేటు వేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. Rain News: ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు.. ఆదివాసీల గృహాలపై విరిగిపడ్డ కొండ చరియలు
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ కోర్టులో పిటిషన్ వేశారు. స్పీకర్ కార్యాలయంలో పిటిషన్ ఇచ్చినా స్పీకర్ చర్యలు తీసుకోలేదని కోర్టుకు పిటిషనర్లు తెలిపార. అనర్హత పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తి అయ్యాయి. తీర్పును ఈరోజుకు ధర్మాసనం రిజర్వ్ చేసింది. ఈ రోజు ఉదయం కోర్ట్ ప్రారంభం అవ్వగానే తీర్పును హైకోర్టు వెలువరించనుంది. దీంతో తీర్పుపై అటు కాంగ్రెస్ ఇటు బీఆర్‌ఎస్‌లో ఉత్కంఠ నెలకొంది.
ఇవి కూడా చదవండి...
Kanpur Train Accident: పేలుళ్లకు కుట్ర.. రైలు బోల్తా కొట్టేందుకు గ్యాస్ సిలిండర్‌తో ప్లాన్
AP News: బంగాళాఖాతంలో వాయుగుండం.. 48 గంటల పాటు భారీ వర్షాలు.. ఆ జిల్లాలో స్కూళ్లకు సెలవు..
Read Latest Telangana News And Telugu News
Updated Date - Sep 09 , 2024 | 11:10 AM