Holi Festival: హోలీ రే... హైదరాబాద్‌లో రంగుల పండగ సందడి.. అదరగొడుతున్న ఈవెంట్లు
ABN, Publish Date - Mar 25 , 2024 | 09:24 AM
Telangana: భాగ్యనగరంలో హోలీ వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. హ్యాపీ హోలీ అంటూ యువత ఈరోజు (సోమవారం) తెల్లవారుజాము నుంచే పండుగ సంబరాల్లో పాల్గొంటున్నారు. కలర్‌ఫుల్ పండుగ వేడుకల్లో హైదరాబాద్ సరికొత్త అందాలను సంతరించుకుంది. ముఖ్యంగా హోలీ వేడుకల్లో యువత ఉత్సాహం అంతాఇంతా కాదు. చిన్నా, పెద్దా అందరూ కలిసి హోలీ వేడుకల్లో పాల్గొంటున్నారు. ఒకరికి ఒకరు రంగులు పూసుకుంటూ కలర్‌ఫుల్ పండుగను ఎంజాయ్ చేస్తున్నారు.
హైదరాబాద్, మార్చి 25: భాగ్యనగరంలో హోలీ (Holi Festival) వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. హ్యాపీ హోలీ అంటూ యువత ఈరోజు (సోమవారం) తెల్లవారుజాము నుంచే పండుగ సంబరాల్లో పాల్గొంటున్నారు. కలర్‌ఫుల్ పండుగ వేడుకల్లో హైదరాబాద్ సరికొత్త అందాలను సంతరించుకుంది. ముఖ్యంగా హోలీ వేడుకల్లో యువత ఉత్సాహం అంతాఇంతా కాదు. చిన్నా, పెద్దా అందరూ కలిసి హోలీ వేడుకల్లో పాల్గొంటున్నారు. ఒకరికి ఒకరు రంగులు పూసుకుంటూ కలర్‌ఫుల్ పండుగను ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో నగరం మొత్తం ఎక్కడ చూసినా రంగుల మయంగా మారిపోయింది. కుటుంబసభ్యులు, స్నేహితులు, బంధువుల మధ్య హైదరాబాదీలు పండుగను జరుపుకుంటున్నారు. మరోవైపు సికింద్రాబాద్ , గచ్చిబౌలి, హైటెక్ సిటీ, పీపుల్స్ ప్లాజాలో హోలీ ఈవెంట్లు ఏర్పాటు చేశారు. డీజేలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఈవెంట్ల నిర్వాహకులు అదరగొడుతున్నారు. సికింద్రాబాద్ తార్నాకలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో బల్దియా కార్మికుల హోలీ సంబరాలు జరుపుకున్నారు. ఈ వేడుకల్లో డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి పాల్గొన్నారు. కాగా.. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో నిన్ననే (ఆదివారం) హోలీ వేడుకలు జరుపుకున్నారు.
బీఆర్‌ఎస్.. మళ్లీ టీఆర్‌ఎస్‌గా మార్పు?
కాగా.. ప్రతి ఏడాది ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి రోజు హోలీ పండుగను జరుపుకుంటాం. హోలీ పండుగను హోలికా పూర్ణిమ అని కూడా అంటారు. దేశ వ్యాప్తంగా కూడా హోలీ సందడి మొదలైంది. అలాగే గత రాత్రి కామ దహన కార్యక్రమం ఘనంగా జరిగింది. హోలీ పండుగకు ముందు రోజు కాముడిని దహనం చేయడం ఆనవాయితీగా వస్తోంది.వాల్మీకి కులస్థులు ఈ దహన వేడుకలను జరిపారు. తమ ఆచారాలలో భాగంగా వాల్మీకి కులస్థులు ఈ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ముందుగా కాముడికి ప్రత్యేక పూజలు చేసి కామ దహనం చేశారు.
ఇవి కూడా చదవండి..
Holi: హైదరాబాద్‌లో ఏయే ప్రాంతాల్లో హోలీ బాగా జరుపుకుంటారో తెలుసా..?
AP Eletions: చిత్తయినా..అదే ఎత్తు..!
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...
Updated Date - Mar 25 , 2024 | 10:13 AM