TS News: ప్రేమజంటలే లక్ష్యంగా వసూళ్లకు పాల్పడుతున్న హోంగార్డ్ అరెస్ట్
ABN, Publish Date - Aug 07 , 2024 | 12:10 PM
Telangana: ప్రేమజంటలే లక్ష్యంగా వసూళ్లకు పాల్పడుతున్న ఓ హోంగార్డును బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.కేబీఆర్ పార్కు జీహెచ్ఎంసీ వాక్ వేలో ప్రేమ జంటలు, స్నేహితులైన యువతీ యువకులను టార్గెట్ చేసి వారిని బెదిరించి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న ఇంటర్ సెప్టార్ పెట్రోలింగ్ వెహికల్ హోంగార్డుతో పాటు మరో బ్రోకర్‌ను ఖాకీలు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్, ఆగస్టు 7: ప్రేమజంటలే లక్ష్యంగా వసూళ్లకు పాల్పడుతున్న ఓ హోంగార్డును (Home Gaurd) బంజారాహిల్స్ పోలీసులు (Banjarahills Police) అరెస్ట్ చేశారు. కేబీఆర్ పార్కు జీహెచ్ఎంసీ వాక్ వేలో ప్రేమ జంటలు, స్నేహితులైన యువతీ యువకులను టార్గెట్ చేసి వారిని బెదిరించి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న ఇంటర్ సెప్టార్ పెట్రోలింగ్ వెహికల్ హోంగార్డుతో పాటు మరో బ్రోకర్‌ను ఖాకీలు అరెస్ట్ చేశారు. కేబీఆర్ పార్కు చుట్టూ జీహెచ్ఎంసీ వాక్వేలో వాకర్లు, సందర్శకుల భద్రత కోసం ఇంటర్ సెప్టార్ పెట్రోలింగ్ వాహనాలను ప్రవేశపెట్టి సాయుధులైన పోలీసులతో నిఘా ఏర్పాటు చేశారు.
Cyber criminals: నగరంలో.. ఆగని సైబర్ మోసాలు..
ఇందులో భాగంగా హెడ్ క్వార్టర్స్ నుంచి వచ్చే ఇంటర్ సెప్టార్ పెట్రోలింగ్ వెహికల్ హోంగార్డు ముద్దం శ్రీనివాస్ పార్కు చుట్టూ పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో వాక్ వేలో వచ్చే ప్రేమ జంటలు, యువతీ యువకులను లక్ష్యంగా చేసుకుని సదరు హోంగార్డు బెదిరింపులకు పాల్పడ్డాడు. రోడ్డు నెంబర్-45 వైపు బాలకృష్ణ ఇంటి ఎదురుగా వాక్ వేలో యువతీ యువకులు కూర్చోగా వారి వద్దకు వెళ్లి మిమ్మల్ని పోలీసులకు పట్టిస్తానంటూ బెదిరించాడు. లేదంటే... 5 వేలు ఇవ్వాలని హోంగార్డ్ డిమాండ్ చేశాడు.
AP Politics: వైసీపీకి భారీ షాక్.. పార్టీకి గుడ్ బై చెప్పిన మాజీ ఎమ్మెల్యే దొరబాబు..
అంతే కాకుండా వాక్ వేలో ప్రేమ జంటలు వస్తే సమాచారం కోసం ఓ బ్రోకర్‌ను కూడా ఏర్పాటు చేశాడు హోంగార్డు. పదుల సంఖ్యలో బాధితులు హోంగార్డు వేధింపులు గురయ్యారు. చివరకు పాపం పండి పోలీసులకు చిక్కాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు... చాకచక్యంగా హోంగార్డును అదుపులోకి తీసుకున్నారు. అతనిపై ఐపీసీ 393 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. హోంగార్డు శ్రీనివాస్‌తో పాటు బ్రోకర్‌గా వ్యవహరిస్తున్న యాదగిరిని కూడా పోలీసులు రిమాండ్‌కు తరలించారు.
ఇవి కూడా చదవండి...
KTR: చేనేత కార్మికులకు హృదయపూర్వక శుభాకాంక్షలు..
Tummala: ఇరిగేషన్ అధికారులపై మంత్రి తుమ్మల ఆగ్రహం.. కారణమిదే!
Read Latest Telangana News And Telugu News
Updated Date - Aug 07 , 2024 | 01:17 PM