ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేశుడికి భారీగా విరాళాలు..

ABN, Publish Date - Sep 16 , 2024 | 07:08 PM

ఖైరతాబాద్ మహాగణపతి హుండీలో విరాళాల వర్షం కురిసింది. ఎన్నడూ లేనంత స్థాయిలో భారీగా హుండీ ఆదాయం వచ్చి చేరింది. కేవలం హుండీ కానుకల ద్వారానే 70 లక్షల ఆదాయం వచ్చినట్లు అధికారులు సోమవారం వెల్లడించారు.

హైదరాబాద్: ఖైరతాబాద్ మహాగణపతి హుండీలో విరాళాల వర్షం కురిసింది. ఎన్నడూ లేనంత స్థాయిలో భారీగా హుండీ ఆదాయం వచ్చి చేరింది. కేవలం హుండీ కానుకల ద్వారానే 70 లక్షల ఆదాయం వచ్చినట్లు అధికారులు సోమవారం వెల్లడించారు. ఇక మహా గణపతికి సంబంధించిన హోర్డింగ్లు, ప్రకటనల ద్వారా మరో రూ.40 లక్షలు ఆదాయం సమకూరినట్లు చెప్పారు. దీనికితోడు ఆన్‌లైన్ ద్వారా విరాళాల సేకరణ జరిగింది. అంటే.. ఈసారి ఖైరతాబాద్ మహా గణపతికి రూ.కోటికిపైనే ఆదాయం వచ్చిందనమాట. హుండీ లెక్కింపును తొలిసారిగా సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరపడం విశేషం.


నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి...

ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనానికి సిద్ధమయ్యారు. మంగళవారం మధ్యాహ్నం మహాగణపతి గంగమ్మ ఒడికి చేరనున్నారు. నిమజ్జనం ఏర్పాట్లలో భాగంగా సోమవారం ఉదయం ఖైరతాబాద్ గణనాథుడి వద్ద కర్రల తొలగింపు పనులు ప్రారంభమయ్యాయి. ఇవాళ దర్శనానికి భక్తులకు అనుమతి నిరాకరించారు. నాలుగు వైపులా బారికేడ్లును పోలీసులు ఏర్పాటు చేశారు.

ట్యాంక్‌బండ్ వద్ద గణేష్ నిమజ్జన కార్యక్రమం కొనసాగుతోంది. హుస్సేన్ సాగర్ చుట్టూ భారీగా క్రేన్లు ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా, జలవిహార్, బేబీ వాటర్ పాండ్ వద్ద క్రేన్లు ఏర్పాటు చేశారు. హుస్సేన్ సాగర్ చుట్టూ మెుత్తంగా 31 క్రేన్లు ఏర్పాటు అయ్యాయి. క్రేన్ నంబర్ 4 వద్ద ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం జరుగనుంది.


బారులు తీరిన గణనాథులు

మరోవైపు గణేష్ విగ్రహాల నిమజ్జనాలతో ట్యాంక్‌బండ్ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్‌జామ్ అయ్యింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్‌జామ్‌తో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గణేష్‌ విగ్రహాల నిమజ్జనాల కోసం భారీగా వాహనాల రాకతో ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఖైరతాబాద్‌, లక్డీకాపూల్ సహా పలుచోట్ల ట్రాఫిక్‌ స్తంభించింది. ఖైరతాబాద్, లక్డీకాపూల్, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.

దీంతో వినాయక నిమజ్జనాలు ఆలస్యం అవుతున్నాయి. హుస్సేన్ సాగర్ చుట్టూ సరిపడా క్రేన్లు లేకపోవడంతో నిమజ్జనం కోసం గణనాథులు బారులు తీరాయి. దాదాపు 5 కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. అర్ధరాత్రి నుంచి నిమజ్జనాల కోసం గణనాథులు వెయిటింగ్‌లో ఉన్నాయి. ఖైరతాబాద్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్ మార్గాలను పోలీసులు మూసివేశారు. ట్యాంక్ బండ్‌కు వచ్చే వాహనాలను దారి మళ్లించారు.

For Latest News and National News click here

Updated Date - Sep 16 , 2024 | 07:08 PM

Advertising
Advertising