ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

HYDRA: మాదాపూర్‌లో హైడ్రా కూల్చివేతలు....

ABN, Publish Date - Sep 23 , 2024 | 11:25 AM

Telangana: మాదాపూర్‌లో కూల్చివేతలు మొదలుపెట్టింది హైడ్రా. కావూరి హిల్స్ పార్కు స్థలంలో వెలసిన అక్రమ షెడ్లను హైడ్రా సిబ్బంది కూల్చివేశారు. పార్కులో స్పోర్ట్స్ అకాడమిపై గత కొంతకాలంగా కావురి హిల్స్ అసోసియేషన్ ఫిర్యాదులు చేసింది.

HYDRA

హైదరాబాద్, సెప్టెంబర్ 23: నగరంలో హైడ్రా (HYDRA) బుల్డోజర్ దూసుకెళ్తోంది. నిన్న (ఆదివారం) కూకట్‌పల్లిలోని నల్లచెరువు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌ పరిధిలో నిర్మాణాలను నేలమట్టం చేసిన హైడ్రా.. ఈరోజు మాదాపూర్‌లో కూల్చివేతలు మొదలుపెట్టింది. కావూరి హిల్స్ పార్కు స్థలంలో వెలసిన అక్రమ షెడ్లను హైడ్రా సిబ్బంది కూల్చివేశారు. పార్కులో స్పోర్ట్స్ అకాడమిపై గత కొంతకాలంగా కావురి హిల్స్ అసోసియేషన్ ఫిర్యాదులు చేసింది.

Viral Video: మనవడి కోసం వినూత్న ట్రెడ్‌మిల్ తయారు చేసిన తాత.. ఆ కుర్రాడి బాధలు చూస్తే నవ్వు రాక తప్పదు..


వెంటనే రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు.. స్పోర్ట్స్ అకాడమీ నిర్మాణాలను తొలగించారు. నిర్మాణాలను తొలగించిన అనంతరం కావురిహిల్స్ పార్క్ అని అధికారులు బోర్డును ఏర్పాటు చేశారు. అయితే కావురి హిల్స్ అసోషియషన్ నుంచి 25 సంవత్సరాలు తమకు లీజుకు ఇవ్వడం జరిగిందని స్పోర్ట్స్ అకాడమీ నిర్వాహకులు చెబుతున్నారు. 25 సంవత్సరాల గడువు ముగియక ముందే అన్యాయంగా నిర్మాణాలను తొలగిస్తున్నారని స్పోర్ట్స్‌ నిర్వాహకులు ఆరోపిస్తున్నారు.


కూకట్‌పల్లిలో కూల్చివేతలు...

ఇదిలా ఉండగా.. నిన్న కూకట్‌పల్లి శాంతినగర్‌లోని నల్లచెరువు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌ పరిధిలో నాలుగు ఎకరాల విస్తీర్ణంలో కూల్చివేసింది. నిన్న ఉదయం 5 గంటల నుంచి భారీ పోలీసులు బందోబస్తు నడుమ కూల్చివేతలు చేపట్టారు. కూకట్‌పల్లి శాంతినగర్‌లోని నల్లచెరువు 27 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ చెరువు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లోని దాదాపు నాలుగు ఎకరాల విస్తీర్ణంలో కొందరు వ్యక్తులు షెడ్లు నిర్మించి వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. కేటరింగ్‌ కోసం కిచెన్‌లు ఏర్పాటు చేశారు. ఇతరత్రా వ్యాపారాలూ సాగుతున్నాయి. వాటిలో పనిచేసే కార్మికులు ఉండేందుకు తాత్కాలిక నివాసాలు నిర్మించారు. ఫిర్యాదుల నేపథ్యంలో పలుమార్లు చెరువును పరిశీలించిన హైడ్రా అధికారులు.. నిర్మాణాలు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లో ఉన్నట్టు నిర్ధారణకు వచ్చారు.

Tirumala Laddu: తిరుమల లడ్డూ కల్తీపై ‘సిట్‌’కు ఏపీ సర్కార్ ఆదేశం


సర్వే నంబర్లు 66, 67, 68, 69లోని 16 వాణిజ్య షెడ్లు, ప్రహరీ గోడలను నేలమట్టం చేశారు. ఇందులో ఐదు కేటరింగ్‌ షెడ్లు, మూడు ఫ్లెక్సీ ప్రింటింగ్‌ నిర్మాణాలు, రెండు టెంట్‌ హౌస్‌లు, ఆరు గోడౌన్లు ఉన్నాయి. ఒక టెంట్‌హౌస్‌కు చెందిన గోడౌన్‌లో సామాను బయటకు తీయకుండానే నేలమట్టం చేశారు. కూల్చివేతలను ప్రారంభించగానే వ్యాపారులు, అక్కడ నివసించేవారు అడ్డుకునే ప్రయత్నం చేశారు. తమకు అన్యాయం చేయొద్దంటూ అధికారులకు మొర పెట్టుకున్నారు. అయితే అధికారులు వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తూనే కూల్చివేతలను కొనసాగించారు.భారీ ఎత్తున కేటరింగ్‌ నిర్వహించే ఓ వ్యక్తి అక్కడే స్థిర నివాసం ఏర్పాటుచేసుకొని ఉంటున్నారు. కూల్చివేతల నేపథ్యంలో ఆయనతోపాటు కుటుంబ సభ్యులు రోదిస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.


ఇవి కూడా చదవండి..

Hyderabad: రికార్డు క్రియేట్ చేసిన హైడ్రా..

200 Year Old Message: గాజు సీసాలో 200 ఏళ్ల నాటి సందేశం.. పురావస్తు శాఖ తవ్వకాల్లో లభ్యం

Read latest Telangana News And Telugu News

Updated Date - Sep 23 , 2024 | 11:56 AM