ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hydra: స్పీడ్ తగ్గింది.. కారణం అదేనా..

ABN, Publish Date - Sep 29 , 2024 | 04:02 PM

అక్రమ నిర్మాణాల కూల్చివేత సెగ సామాన్యుడి వరకు వెళ్లడంతో హైడ్రాకు వ్యతిరేకంగా నిరసనలు ప్రారంభమయ్యాయి. ఓవైపు అక్రమ నిర్మాణాలను కూలుస్తు్న్నాం.. సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టడం లేదని అధికారులు చెబుతుంటే.. ఎటువంటి సమాచారం లేకుండా తాము నివాసం ఉంటున్న ఇళ్లులు కూలుస్తున్నారంటూ..

HYDRA

చెరువులు, కుంటలు, నాళాలు కబ్జా చేసి నిర్మణాలు చేపట్టిన భవన యజమానులకు హైడ్రా నిద్రపట్టనీయడం లేదు. ఎప్పుడు వచ్చి తమ భవనాలను కూల్చేస్తారో అంటూ జనం ఆందోళన చెందుతున్నారు. ప్రతిరోజు హైడ్రా ఏదో ఒక ప్రాంతంలో హైడ్రా భవనాలను కూలుస్తోంది. ప్రారంభంలో హైడ్రా కూల్చివేతలపై జనం ప్రశంసలు కురిపించారు. దీంతో హైడ్రా మరింత దూకుడు పెంచింది. అక్రమ నిర్మాణాల కూల్చివేత సెగ సామాన్యుడి వరకు వెళ్లడంతో హైడ్రాకు వ్యతిరేకంగా నిరసనలు ప్రారంభమయ్యాయి. ఓవైపు అక్రమ నిర్మాణాలను కూలుస్తు్న్నాం.. సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టడం లేదని అధికారులు చెబుతుంటే.. ఎటువంటి సమాచారం లేకుండా తాము నివాసం ఉంటున్న ఇళ్లులు కూలుస్తున్నారంటూ కొందరు ప్రజలు ఆరోపిస్తున్నారు. కొన్నేళ్ల క్రితం చెరువులు, నాళాలు ఆక్రమించి చేపట్టిన భవన నిర్మాణాల్లో ప్లాట్లను పేద, మధ్య తరగతి ప్రజలు బ్యాంకు రుణాలు తీసుకుని కొనుగోలు చేశారు. ప్రస్తుతం అక్రమ నిర్మాణాలని హైడ్రా కూల్చివేస్తుండటంతో సాధారణ ప్రజలు లబోదిబోమంటున్నారు. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత తర్వాత.. బడా కబ్జాదారులు, పెద్ద పెద్ద వ్యక్తుల ఆక్రమణలను హైడ్రా తొలగిస్తుందని అంతా అంచనా వేశారు. క్రమంగా సామాన్యుడి దగ్గరకు హైడ్రా వెళ్లడంతో నిరసనలు మొదలయ్యాయి. తాజాగా ఆదివారం, సెలవు దినాల్లో కూల్చివేతలకు బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించడంతో హైడ్రా స్పీడ్ తగ్గిందా అనే చర్చ జరుగుతోంది.

Somireddy: జగన్‌పై సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు..


ప్రశంసలు.. విమర్శలు..

ప్రారంభంలో హైడ్రాపై ప్రజలు ప్రశంసల వర్షం కురిపించారు. కొందరు బడా బాబులు తమ పరపతిని ఉపయోగించి అక్రమంగా అనుమతులు పొంది నిర్మించిన కట్టడాలను కూల్చేయాలనే డిమాండ్ వినిపించింది. ప్రస్తుతం కూడా హైడ్రా కూల్చివేతలపై కొందరు హర్షం వ్యక్తం చేస్తున్నా.. మొదట బడా బాబుల ఆక్రమణలను తొలగించి తరువాత సామాన్యుడి వద్దకు వెళ్లాలని కోరుతున్నారు. అలాగే సామాన్య, మధ్య తరగతి ప్రజలు లక్షలు పెట్టి కొనుగోలు చేసిన ఇళ్లను అక్రమ నిర్మాణాల పేరుతో కూలుస్తుండటంతో తమకు ఎలాంటి పరిహారం ఇప్పించకుండా కూలుస్తుంటే తమ భవిష్యత్తు ఏం కావాలనే ఆందోళన సామాన్య ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. హైడ్రా పనితీరుపై రోజురోజుకు అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. హైడ్రా తీరుతో ప్రభుత్వంపై ప్రజల్లో రోజురోజుకు వ్యతిరేకత పెరుగుతుండటంతో హైడ్రా స్పీడ్ తగ్గినట్లు అనిపిస్తోంది. రాజకీయ పార్టీలు సైతం మొదట్లో హైడ్రా పనితీరుకు మద్దతు పలకగా.. ప్రస్తుతం సామాన్య ప్రజలను ఇబ్బంది పెడుతోందంటూ విమర్శలు వస్తున్నాయి.

స్వచ్ఛభారత్‌కు మీరే వెన్నెముక


విపక్షాల నిరసన..

హైడ్రా తీరుపై ప్రతిపక్ష బీఆర్‌ఎస్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తోంది. మరోవైపు మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు తాము అండగా ఉంటామని భరోసా ఇస్తోంది. హైడ్రా అక్రమ నిర్మాణాలపై నిరసనలకు పిలుపునివ్వడంతో ప్రజలు రోడ్లపైకి వచ్చే అవకాశం ఉండటంతో హైడ్రా వేగం తగ్గించిందనే చర్చ జరుగుతోంది. ఓవైపు బాధితుల నుంచి వ్యతిరేకత, ప్రతిపక్ష పార్టీ నుంచి విమర్శల నేపథ్యంలో హైడ్రా రానున్న రోజుల్లో ఎలా ముందుకెళ్తుందనేది వేచి చూడాలి.

పకడ్బందీగా పథకాల అమలు

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Latest Telugu News Click Here

Updated Date - Sep 29 , 2024 | 04:02 PM