ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Danam Nagender: బీఆర్ఎస్ చేస్తే సంసారం.. మేం చేస్తే వ్యభిచారమా?: దానం నాగేందర్

ABN, Publish Date - Sep 10 , 2024 | 02:07 PM

బీఆర్ఎస్ నుంచి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అంశంపై శాసన సభాపతి నిర్ణయం తీసుకోవాలంటూ హైకోర్ట్ ఆదేశించిన నేపథ్యంలో ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’తో మాట్లాడిన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

హైదరాబాద్: బీఆర్ఎస్ నుంచి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అంశంపై శాసన సభాపతి నిర్ణయం తీసుకోవాలంటూ హైకోర్ట్ ఆదేశించిన నేపథ్యంలో ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’తో మాట్లాడిన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు పార్టీ మారిన విషయంపై మాట్లాడుతూ.. బీఆర్ఎస్ చేస్తే సంసారం.. మేం చేస్తే వ్యభిచారమా? అని ఆయన ప్రశ్నించారు. ‘‘నేను రూల్ ప్రకారమే ఎంపీగా పోటీచేశాను. బీఆర్ఎస్ వాళ్లు మాకు రూల్స్ చెప్తారా?. అనర్హత గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్‌కి లేదు. ఫిరాయింపులకు శ్రీకారం చుట్టిందే కేసీఆర్’’ అని దానం నాగేందర్ మండిపడ్డారు.


కేసీఆర్ ప్రభుత్వ హాయాంలో పీఏసీ ఛైర్మన్ బాధ్యతలు అక్బరుద్దీన్ ఒవైసీకి ఎందుకు ఇచ్చారని బీఆర్ఎస్‌ను దానం నాగేందర్ ప్రశ్నించారు. ‘‘కేసీఆర్ హాయాంలో ప్రతిపక్షానికి డిప్యూటీ స్పీకర్ ఎందుకు ఇవ్వలేదు?. స్పీకర్ నిర్ణయం తర్వాత మా నిర్ణయం మేం చెప్తాం. బీఆర్ఎస్ నాయకులు శునకానందం పొందుతున్నారు. సరైన సమయంలో ఏం చేయాలో మాకు తెలుసు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకున్న వాళ్లు ఇప్పుడు మాట్లాడుతున్నారా?. రాష్ట్ర ఖజానా దోచుకున్న వాళ్లు ఇప్పుడు ఏం అర్హత ఉందని మాట్లాడుతున్నారు?. వాళ్లపై వస్తున్న ఆరోపణలు తప్పించుకునేందుకు మాపై ఆరోపణలు చేస్తున్నారు. బీఆర్ఎస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది. అనర్హతకి సంబంధించి ఎక్కడ మాట్లాడాలో అక్కడే మాట్లాడుతా. దోచుకున్న డబ్బు దాచుకోవడానికి కేటీఆర్ విదేశాలకు వెళ్లారు. బీఆర్ఎస్ పార్టీలో ఓడిన వాళ్లకి విశ్వాసం లేదు. గెలిచిన వాళ్లకి విశ్వాసం లేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏం చేయాలో అర్థం కాక భయపడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఎవరు మిగలరు’’ అని దానం నాగేందర్ అన్నారు.

Updated Date - Sep 10 , 2024 | 02:08 PM

Advertising
Advertising