ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అరవింద్.. కొడుకు కోసమేనా..

ABN, Publish Date - Dec 18 , 2024 | 04:44 PM

సంధ్య థియేటర్ ఘటనలో గాయపడి చికిత్సపొందుతున్న చిన్నారి శ్రీతేజ్‌ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తండ్రి అరవింద్ పరామర్శించారు. ఇవాళ (బుధవారం) మధ్యాహ్నం కిమ్స్ ఆస్పత్రికి వెళ్లిన అల్లు అరవింద్.. శ్రీతేజ్ కుటుంబసభ్యులతో మాట్లాడారు.

Allu Arjun Arrest

హైదరాబాద్: సంధ్య థియేటర్ (Sandhya Theater) ఘటనలో గాయపడి చికిత్సపొందుతున్న చిన్నారి శ్రీతేజ్‌ (Sreetej)ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తండ్రి అరవింద్ (Allu Aravind) పరామర్శించారు. ఇవాళ (బుధవారం) మధ్యాహ్నం కిమ్స్ ఆస్పత్రికి వెళ్లిన అల్లు అరవింద్.. శ్రీతేజ్ కుటుంబసభ్యులతో మాట్లాడారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. శ్రీతేజ్ తల్లి రేవతి మృతిచెందడంపై అరవింద్ ఆవేదన వ్యక్తం చేశారు. అదో దురదృష్టకర ఘటన అని అన్నారు. బాధిత కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం తమకు పూర్తిస్థాయిలో సహకారం అందించిందని చెప్పారు. కేసు కోర్టులో ఉన్నందున అల్లు అర్జున్‌ రాలేకపోయారని అరవింద్ అన్నారు. బన్నీ తరఫున తానే స్వయంగా ఆస్పత్రికి వచ్చినట్లు అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు.

Updated Date - Dec 18 , 2024 | 05:58 PM