Threatening Calls: గోవా నుంచి కలకత్తా వెళ్తున్న విమానానికి బాంబు బెదిరింపు
ABN, Publish Date - Nov 03 , 2024 | 09:27 AM
గోవా నుంచి కలకత్తా వెళ్తున్న విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో అధికారులు హైదరాబాద్, శంషాబాద్ ఎయిర్ పోర్టులో విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేశారు. విమానంలో ప్రయాణిస్తున్న 180 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎయిర్ పోర్టు భద్రతా సిబ్బంది ప్రయాణీకులను కిందకు దించి విమానంలో తనిఖీలు చేపట్టారు. ఇండిగో, ఎయిర్ ఇండియా విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి.
హైదరాబాద్: గోవా (Goa) నుంచి కలకత్తా (Calcutta) వెళ్తున్న విమానానికి బాంబు బెదిరింపు కాల్ (Threatening Calls) వచ్చింది. దీంతో అధికారులు హైదరాబాద్, శంషాబాద్ ఎయిర్ పోర్టులో (Shamshabad Airport) విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ (Plane Emergency landing ) చేశారు. విమానంలో ప్రయాణిస్తున్న 180 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎయిర్ పోర్టు భద్రతా సిబ్బంది ప్రయాణీకులను కిందకు దించి విమానంలో తనిఖీలు చేపట్టారు. కాగా ఇండిగో, ఎయిర్ ఇండియా విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి.
కాగా విమానాలకు వరుస బాంబు బెదిరింపుల వేళ అప్రమత్తంగా ఉండాల్సిన తరుణంలో భారీ భద్రతా వైఫల్యం బయటపడింది. అక్టోబరు 27న దుబాయ్ నుంచి ఢిల్లీ వచ్చిన ఎయిర్ ఇండియా విమానంలో తూటా లభ్యమైంది. ఏఐ 916 విమానంలో సిబ్బంది శుభ్రం చేస్తుండగా ప్రయాణికుల సీట్ పాకెట్‌లో తూటా దొరికింది. దీంతో ఆయుధ చట్టం ప్రకారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు, ఇండియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానానికి శనివారం బాంబు బెదిరింపు వచ్చింది. ఖాట్మాండూ నుంచి ఢిల్లీ వెళ్లే విమానంలో బాంబు ఉందంటూ అగంతకులనుంచి సమాచారం రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నేపాల్ రాజధాని ఖాట్మాండూలోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు 4 గంటల పాటు తనిఖీలు చేశారు. చివరకు బాంబు బెదిరింపు ఉత్తిదే అని తేల్చారు. గతనెల 28న కూడా నేపాల్ నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానానికి కూడా ఇలాగే బాంబు బెదిరింపు వచ్చింది. సోషల్ మీడియా ద్వారా శనివారం మొత్తం 19 ఇండిగో విమానాలకు బెదిరింపులు వచ్చాయని అధికారులు తెలిపారు. గత రెండు వారాల్లో ఇప్పటివరకు 510 స్థానిక, అంతర్జాతీయ విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. కాగా, బిహార్‌లోని దర్భంగా నుంచి న్యూఢిల్లీ వచ్చే బిహార్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌కు కూడా శుక్రవారం సాయంత్రం ఇలాంటి హెచ్చరికే వచ్చింది. దీంతో రైలును మధ్యలో ఓ స్టేషన్‌లో నిలిపివేసి క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. అయితే, ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు.
కాగా దేశవ్యాప్తంగా పలు విమానాలకు బాంబు బెదిరింపుల పరంపర కొనసాగుతోంది. ఆ క్రమంలో మంగళవారం చెన్నై- విశాఖ, బెంగళూరు-విశాఖ ఇండిగో విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో విశాఖ విమానాశ్రయంలో ప్రయాణికులను కిందకి దింపి భద్రతా సిబ్బంది ఆయా విమానాల్లో తనిఖీలు చేపట్టారు. అనంతరం ఎక్కడ ఏ విధమైన పేలుడు పదార్ధాలు లభ్యం కాకపోవడంతో విమానాశ్రయ అధికారులతోపాటు ప్రయాణికులు సైతం ఊపిరి పీల్చుకున్నారు.
ఇండిగో ఎయిర్‌లైన్స్ స్టేషన్ మేనేజర్‌కు సాయంత్రం 05:38 గంటలకు బాంబు బెదిరింపు ట్వీట్ అందింది. దీంతో విమానాశ్రయ అధికారులకు స్టేషన్ మేనేజర్ అప్రమత్తం చేశారు. అయితే ఆడమ్ లామ్‌జా 202 ఐడీ నుంచి ట్వీట్ వచ్చినట్లు ఇండిగో సంస్థ వెల్లడించింది. అయితే ఈ రెండు విమానాలకు సెక్యూరిటీ క్లియరెన్స్ లభించింది. దీంతో బోర్డింగ్‌ను ప్రయాణికులకు ఎయిర్ పోర్ట్ అధికారులు అనుమతి ఇచ్చారు. దీంతో మూడు గంటల ఆలస్యంగా ఇండిగో విమానాలు బయలుదేరి గమ్యస్థానాలకు పయనమయ్యాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
మచిలీపట్నంలో ముగ్గురు మైనర్ బాలుర మిస్సింగ్ కలకలం..
జగన్‌ను శిక్షించాలా.. వద్దా..: సీఎం చంద్రబాబు
వారికి అదే చివరి రోజు: సీఎం చంద్రబాబు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Nov 03 , 2024 | 09:28 AM