ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Pawan Kalyan: రామోజీరావును కలిసి చాలా విషయాలు చెప్పాలనుకున్నా!

ABN, Publish Date - Jun 08 , 2024 | 06:12 PM

ఈనాడు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు (Ramoji Rao) తిరిగి రానిలోకాలకు చేరుకున్నారు. ఆయన లేరన్న విషయాన్ని తెలు మీడియా ఇండస్ట్రీ జీర్ణించుకోలేకపోతోంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు యావత్ ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రజలు, ప్రముఖులు మీడియా, సోషల్ మీడియా వేదికగా రామోజీ మరణంపై స్పందిస్తున్నారు...

హైదరాబాద్: ఈనాడు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు (Ramoji Rao) తిరిగి రానిలోకాలకు చేరుకున్నారు. ఆయన లేరన్న విషయాన్ని తెలు మీడియా ఇండస్ట్రీ జీర్ణించుకోలేకపోతోంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు యావత్ ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రజలు, ప్రముఖులు మీడియా, సోషల్ మీడియా వేదికగా రామోజీ మరణంపై స్పందిస్తున్నారు. ఢిల్లీ పర్యటనలో బిజిబిజీగా ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ హుటాహుటిన హైదరాబాద్ చేరుకున్నారు. తన మిత్రుడు, టాలీవుడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కలిసి ఫిల్మ్‌సిటీకి వెళ్లిన పవన్.. రామోజీరావు భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన పవన్.. పలు విషయాలు పంచుకున్నారు.


ఇదే విషయం చెప్పాలని..!

రామోజీరావు మృతి దిగ్ర్భాంతి కలిగించింది. రామోజీరావు మహోన్నతమైన వ్యక్తి. తెలుగు రాష్ట్రాల్లో వేలాది మంది జర్నలిస్టులు ఈనాడు జర్నలిజం స్కూలు నుంచే వచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడున్న ఏ జర్నలిస్ట్‌కు అయినా ఈనాడు రూట్స్ ఉంటాయి. అలా వేలాది మంది జర్నలిస్టులను రామోజీరావు అందించారు. సినీ ఇండస్ట్రీకి కూడా ఆయన ఎంతో చేశారు. రామోజీరావును గత కొన్నేళ్లుగా ప్రభుత్వాలు చాలా ఇబ్బంది పెట్టాయి.. వాటన్నింటినీ ఈ వయసులో కూడా తట్టుకున్నారు. ఇబ్బంది పెట్టిన ప్రభుత్వాలు ఈ రోజు లేవు. ఇదే విషయాన్ని రామోజీరావుకు చెప్పాలని అనుకున్నాను. ప్రమాణస్వీకారం తర్వాత వచ్చి కలుద్దామనుకున్నాను. దురదృష్ణం ఇంతలోనే ఇలా జరిగిపోయింది. ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి అండగా నిలబడ్డారు. ఆయన కుటుంబానికి భగవంతుడు అండగా ఉండాలి. జనసేన తరపున సంతాపం తెలియజేస్తున్నానుఅని పవన్ కల్యాణ్ విచారం వ్యక్తం చేశారు.

రామోజీరావు యుగపురుషుడు!


Read more!

Updated Date - Jun 08 , 2024 | 06:19 PM

Advertising
Advertising