ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TG News: తెలంగాణ గవర్నర్‌గా నేడు ప్రమాణస్వీకారం చేయనున్న జిష్ణు దేవ్ వర్మ

ABN, Publish Date - Jul 31 , 2024 | 10:18 AM

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా బుధవారం త్రిపుర మాజీ ఉప ముఖ్యమంత్రి జిష్ణు దేవ్‌ వర్మ ప్రమాణం చేయనున్నారు. ఈరోజు సాయంత్రం 5:30 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాదే ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా (Telangana State Governor ) బుధవారం త్రిపుర (Tripura) మాజీ ఉప ముఖ్యమంత్రి (Former Deputy Chief Minister ) జిష్ణు దేవ్‌ వర్మ (Jishnu Dev Verma) ప్రమాణం చేయనున్నారు. ఈరోజు సాయంత్రం 5:30 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ( High Court Chief Justice) అలోక్ ఆరాదే (Alok Aarade) ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నాలుగవ గవర్నర్‌గా జిష్ణు దేవ్ వర్మ ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) హాజరుకానున్నారు. అలాగే బీఆర్ఎస్ చీఫ్, ప్రతిపక్ష నేత కేసీఆర్ (KCR), విపక్ష పార్టీల నేతలు (Opposition Party leaders), కేంద్ర మంత్రులు (Central Ministers) ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కానున్నారు. 2018 నుంచి 2023 వరకు ఉప ముఖ్యమంత్రిగా జిష్ణు దేవ్ వర్మ పనిచేశారు. త్రిపుర నుంచి ఆయన ఈరోజు మధ్యాహ్నం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ తదితరులు జిష్ణు దేవ్ వర్మకు స్వాగతం పలకనున్నారు.


కాగా తెలంగాణ గవర్నర్‌గా జిష్ణుదేవ్‌ వర్మ నియమితులయిన విషయం తెలిసిందే. త్రిపుర మాజీ ఉప ముఖ్యమంత్రి అయిన ఈయన.. ప్రస్తుత ఇంచార్జి గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ స్థానంలో రానున్నారు. రాజ కుటుంబానికి చెందిన జిష్ణు దేవ్‌ 1957 ఆగస్టు 15న జన్మించారు. ఈయనకు భార్య, ఇద్దరు కుమారులున్నారు. 1990 ప్రారంభంలో బీజేపీలో చేరారు. అయోధ్య రామ జన్మభూమి ఉద్యమంలో పాల్గొన్నారు. 2018-23 మధ్య ఉప ముఖ్యమంత్రిగా, త్రిపుర బ్యాడ్మింటన్‌ సంఘం అధ్యక్షుడిగానూ బాధ్యతలు నిర్వర్తించారు.


మరో మూడు రాష్ట్రాల గవర్నర్లను కేంద్రం వేరే రాష్ట్రాలకు బదిలీ చేశారు. హరిబాబు కిషన్‌రావ్‌ బాగ్డే (రాజస్థాన్‌), ఓం ప్రకాశ్‌ మాథుర్‌ (సిక్కిం), సంతోష్‌ కుమార్‌ గాంగ్వార్‌ (జార్ఖండ్‌), రమెన్‌ దేఖా (ఛత్తీ్‌సగఢ్‌), సీహెచ్‌ విజయశంకర్‌ (మేఘాలయ)లను గవర్నర్లుగా నియమించింది. కాగా, ప్రస్తుతం జార్ఖండ్‌ గవర్నర్‌గా తెలంగాణ అదనపు బాధ్యతలతో ఉన్న సీపీ రాధాకృష్ణన్‌ను మహారాష్ట్ర గవర్నర్‌గా పంపారు. అసోం గవర్నర్‌ గులాబ్‌ చంద్‌ కఠారియాను పంజాబ్‌ గవర్నర్‌గా, కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్‌ అడ్మినిస్ట్రేటర్‌గా నియమించారు. సిక్కిం గవర్నర్‌ లక్ష్మణ్‌ ప్రసాద్‌ ఆచార్యను అసోం గవర్నర్‌గా పంపుతూ.. మణిపూర్‌ అదనపు బాధ్యతలు అప్పగించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బినామీ పేర్లతో పెద్దిరెడ్డి భూముల రిజిస్ట్రేషన్‌..

మద్యం బాటిళ్లకు నకిలీ హోలోగ్రాం స్టిక్కర్లు..

విపక్షాలపై కేంద్రమంత్రి ఫైర్..ర్‌

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jul 31 , 2024 | 10:18 AM

Advertising
Advertising
<