ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Justice L. Narsimha Reddy:కేసీఆర్‌కు నోటీసులు

ABN, Publish Date - Jun 12 , 2024 | 02:41 AM

ఛత్తీసగఢ్‌తో విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం, భద్రాద్రి, యాదాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల నిర్మాణం అంశాలపై విచారణ జరుపుతున్న జస్టిస్‌ ఎల్‌ నర్సింహారెడ్డి కమిషన్‌ బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు జారీ చేసింది. ‘రికార్డులను పరిశీలిస్తుంటే ఆ నిర్ణయాలన్నీ మీరే తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఆయా అంశాల్లో మీ పాత్రపై లిఖితపూర్వకంగా వివరాలు అందించాలి’ అని పేర్కొంది.

  • ‘కరెంటు కొనుగోళ్ల’ రికార్డులను చూస్తే మీరే నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది

  • లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలి.. జస్టిస్‌ ఎల్‌.నర్సింహారెడ్డి కమిషన్‌ ఆదేశం

  • జూలై 30 వరకు గడువు కోరిన మాజీ సీఎం.. ఈ నెల 15లోపు వివరణ ఇవ్వాలన్న కమిషన్‌

  • మొత్తం 25 మందికి నోటీసులు.. ఛత్తీస్‌గఢ్‌తో ఒప్పందం, భద్రాద్రి, యాదాద్రి విద్యుత్కేంద్రాల నిర్మాణంపై విచారణ

  • అర్వింద్‌ కుమార్‌ లేఖ కీలకం.. కమిషన్‌కు మరిన్ని వివరాలు ఇవ్వనున్న రఘు, కోదండ, వేణుగోపాల్‌, తిమ్మారెడ్డి

హైదరాబాద్‌, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి): ఛత్తీస్‌గఢ్ విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం, భద్రాద్రి, యాదాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల నిర్మాణం అంశాలపై విచారణ జరుపుతున్న జస్టిస్‌ ఎల్‌ నర్సింహారెడ్డి కమిషన్‌ బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు జారీ చేసింది. ‘రికార్డులను పరిశీలిస్తుంటే ఆ నిర్ణయాలన్నీ మీరే తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఆయా అంశాల్లో మీ పాత్రపై లిఖితపూర్వకంగా వివరాలు అందించాలి’ అని పేర్కొంది. కాగా తనకు జూలై 30వ తేదీ వరకు గడువు ఇవ్వాలని కేసీఆర్‌ విజ్ఞప్తి చేయగా.. కమిషన్‌కు అందుబాటులో ఉన్న పరిమిత సమయం దృష్ట్యా అప్పటి వరకూ గడువు ఇవ్వలేమని, ఈ నెల 15 లోగా వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది.

మంగళవారం కమిషన్‌ కార్యాలయంలో జస్టిస్‌ ఎల్‌ నర్సింహారెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ ఈ వివరాలు వెల్లడించారు. గత నెలలో కేసీఆర్‌తోపాటు మొత్తం 25 మందికి (వీరిలో పలువురు ప్రభుత్వ అధికారులు) నోటీసులు ఇచ్చామని, కొందరిని కమిషన్‌ ఎదుట హాజరుకావలసిందిగా కోరగా, మరికొందరిని లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని పేర్కొన్నామన్నారు. ఛత్తీసగఢ్‌తో విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం వల్ల కలిగే నష్టంపై తెలంగాణ విద్యుత్‌ నియంత్రణ మండలి(టీఈఆర్‌సీ)కి ఇంధనసమయం దృష్ట్యా అప్పటి వరకూ గడువు ఇవ్వలేమని, ఈ నెల 15 లోగా వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది.

మంగళవారం కమిషన్‌ కార్యాలయంలో జస్టిస్‌ ఎల్‌ నర్సింహారెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ ఈ వివరాలు వెల్లడించారు. గత నెలలో కేసీఆర్‌తోపాటు మొత్తం 25 మందికి (వీరిలో పలువురు ప్రభుత్వ అధికారులు) నోటీసులు ఇచ్చామని, కొందరిని కమిషన్‌ ఎదుట హాజరుకావలసిందిగా కోరగా, మరికొందరిని లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని పేర్కొన్నామన్నారు. ఛత్తీసగఢ్‌తో విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం వల్ల కలిగే నష్టంపై తెలంగాణ విద్యుత్‌ నియంత్రణ మండలి(టీఈఆర్‌సీ)కి ఇంధనశాఖ మాజీ ముఖ్యకార్యదర్శి అర్వింద్‌కుమార్‌ 2016 నవంబరు 30వ తేదీన రాసిన లేఖ కీలకమైన సమాచారం అందించిందన్నారు.


కాంపిటీటివ్‌ బిడ్డింగ్‌ ప్రక్రియను అనుసరించకుండా నామినేషన్‌ పద్ధతిలో ఛత్తీ్‌సగఢ్‌ విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కమ్‌) నుంచి వెయ్యి మెగావాట్ల విద్యుత్‌ కొనుగోలుకు 2014లో నాటి ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని గుర్తు చేశారు. ఓవైపు ఛత్తీస్‌గఢ్ నుంచి 1000 మెగావాట్ల విద్యుత్‌ మాత్రమే కొంటూ మరోవైపు 2000 మెగావాట్ల విద్యుత్‌ కారిడార్‌ (అంతరాష్ట్ర విద్యుత్‌ సరఫరా లైన్ల) కోసం పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాకు దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ డిస్కమ్‌లను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిందన్నారు. ఛత్తీస్‌గఢ్‌తో 2014లో ఒప్పందం చేసుకున్నప్పటికీ మూడేళ్ల వరకు విద్యుత్‌ సరఫరా కాలేదని, 2017లో సరఫరా మొదలైనా మరో మూడేళ్ల తర్వాత నిలిచిపోయిందన్నారు.

ఈ వ్యవహారంతో ఆర్థికంగా నష్టం జరిగినట్లుగా అధికారులు, ఇతరుల ద్వారా తెలిసిందన్నారు. మణుగూరు వద్ద భద్రాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాన్ని సూపర్‌ క్రిటికల్‌ టెక్నాలజీతో కాకుండా సబ్‌ క్రిటికల్‌ టెక్నాలజీతో నిర్మించాలని నిర్ణయించటం వల్ల వాతావరణ కాలుష్యంతోపాటు ఏటా రూ.వెయ్యి కోట్లకు పైగా నష్టం వాటిల్లనుందని పలు వివరాలు తెలియజేస్తున్నాయన్నారు. దీనికి అదనంగా ఏటా రూ.250 కోట్ల నుంచి రూ.300 కోట్ల దాకా విలువైన బొగ్గును ప్లాంటుకు ఉపయోగించాల్సిన పరిస్థితి ఉందని తమకు లభించిన ఆధారాలు వెల్లడిస్తున్నాయన్నారు. 2011లోనే సూపర్‌ క్రిటికల్‌ టెక్నాలజీ అందుబాటులో ఉండగా భద్రాద్రి పవర్‌ ప్లాంట్‌ను సబ్‌ క్రిటికల్‌ టెక్నాలజీతో కట్టడం వల్ల ప్రజలపై దీర్ఘకాలంగా ఆర్థికభారం పడుతున్నట్లు వివిధ వర్గాల ద్వారా లభించిన సమాచారం మేరకు తెలుస్తోందన్నారు.

భద్రాద్రి విద్యుత్‌కేంద్రం పనులను ఒపెన్‌ కాంపిటీటివ్‌ బిడ్డింగ్‌కి బదులు నామినేషన్‌ పద్ధతిలో ఈపీసీ విధానంలో కాంట్రాక్టర్లకు అప్పగించారని, నిర్మాణానికి ఏడేళ్ల కాలవ్యవధి పట్టటంతో నిర్మాణవ్యయం పెరిగిందని పేర్కొన్నారు. యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ను కూడా పోటీ బిడ్డింగ్‌ విధానంలో కాకుండా నామినేషన్‌ ప్రాతిపదికన బీహెచ్‌ఈఎల్‌కు అప్పగించారని గుర్తు చేశారు. 2018లోనే పూర్తి కావాల్సిన ఈ విద్యుత్‌కేంద్రం ఇప్పటికీ పూర్తికాకపోవడం, విదేశీ బొగ్గుతో ప్లాంట్‌లో విద్యుత్‌ ఉత్పత్తి చేయాలని గత ప్రభుత్వం నిర్ణయించటం, తాజా ప్రభుత్వం విదేశీ బొగ్గు అంశాన్ని పక్కనపెట్టి, సింగరేణి నుంచి బొగ్గు తీసుకోవటానికి నిర్ణయించటం వంటి అంశాలను ప్రస్తావించారు. ఇటీవలే ఈ విద్యుత్‌కేంద్రాన్ని సందర్శించామని, ఆగస్టు నాటికి ఒక యూనిట్‌లో విద్యుదుత్పత్తి జరుపుతామని అధికారులు చెబుతున్నప్పటికీ, తనకు సందేహాలున్నాయని జస్టిస్‌ ఎల్‌ నర్సింహారెడ్డి తెలిపారు. ఎందుకంటే, ఇప్పటికీ అక్కడ బొగ్గును సరఫరా చేసే రైల్వేలైను పనులు పూర్తి కాలేదని, రైల్వే లైను టెస్టింగ్‌ పనులే 2-3 నెలల పాటు జరుగుతాయని పేర్కొన్నారు.


హాజరైన అర్వింద్‌కుమార్‌, ఎస్‌కే జోషి

కమిషన్‌ నోటీసులు జారీ చేసిన వారిలో 2014 నుంచి 2023 వరకూ ఇంధనశాఖ కార్యదర్శులుగా ఉన్న అర్వింద్‌కుమార్‌, సురే్‌షచంద, సునిల్‌శర్మ, జెన్‌కో, ట్రాన్స్‌కో మాజీ సీఎండీ డి.ప్రభాకర్‌రావు, మాజీ విద్యుత్‌శాఖ మంత్రి జగదీ్‌షరెడ్డి తదితరులున్నారు. వీరిలో ప్రభాకర్‌రావు సోమవారం కమిషన్‌ ఎదుట హాజరయ్యారు. అర్వింద్‌కుమార్‌, మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి మంగళవారం హాజరయ్యారు. నాటి నిర్ణయాలన్నీ ప్రభుత్వం ఉన్నతస్థాయిలో తీసుకున్నవేనని, వాటిని తాము అమలు చేయడం మాత్రమే జరిగిందని వారు కమిషన్‌కు నివేదించినట్లు సమాచారం. ఛత్తీ్‌సగఢ్‌తో విద్యుత్‌ ఒప్పందం వల్ల కలిగే నష్టంపై తెలంగాణ విద్యుత్‌ నియంత్రణ మండలి(టీఈఆర్‌సీ)కి అర్వింద్‌కుమార్‌ 2016 నవంబరు 30వ తేదీన రాసిన లేఖనే ప్రస్తుతం కమిషన్‌ విచారణలో కీలకంగా మారింది. ఈ లేఖ రాసినందుకుగాను ఆ మరుసటి రోజే అర్వింద్‌కుమార్‌ను గత ప్రభుత్వం ఢిల్లీకి తిప్పి పంపింది.

త్వరలో రఘు, కోదండరాం హాజరు

ఈనెల 18వ తేదీ నుంచి తెలంగాణ విద్యుత్‌ జేఏసీ ఛైర్మన్‌ కె.రఘు, తెలంగాణ జేఏసీ ఛైర్మన్‌ కోదండరాం, విద్యుత్‌ రంగ నిపుణులు వేణుగోపాల్‌, తిమ్మారెడ్డి కమిషన్‌ ముందు హాజరై... వివరాలు అందించనున్నారు. ఇప్పటికే ఆయా నిర్ణయాలపై వీరు కమిషన్‌కు ఫిర్యాదు చేయగా.. మరిన్ని వివరాలు అందించాలని కమిషన్‌ వీరికి కబురు పంపింది. ఈనెల 18వ తేదీన రఘు, 19న కోదండరామ్‌, 20న వేణుగోపాల్‌, తిమ్మారెడ్డి కమిషన్‌ ముందు హాజరయ్యే అవకాశాలున్నాయి. ఛత్తీ్‌సగఢ్‌తో విద్యుత్‌ ఒప్పందం తెలంగాణకు ఏ మాత్రం లాభదాయకం కాదని తొలి నుంచి ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా కె.రఘు గళమెత్తారు

Updated Date - Jun 12 , 2024 | 02:41 AM

Advertising
Advertising