ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Kaleshwaram: జస్టిస్‌ పీసీ ఘోష్‌‌ను కలిసిన హైడ్రాలజీ, నిపుణుల కమిటీ ఇంజినీర్లు..

ABN, Publish Date - Jun 13 , 2024 | 04:25 PM

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project)లో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్‌ కుంగుబాటు, పియర్స్, గేట్లు దెబ్బతినడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో సీపేజీలు సహా పలు సమస్యలపై విచారణ కొనసాగుతోంది. విచారణలో భాగంగా జస్టిస్‌ పీసీ ఘోష్‌‌(Justice PC Ghosh)న్యాయ విచారణ కమిషన్ను హైడ్రాలజీ, నిపుణుల కమిటీ ఇంజనీర్లు కలిశారు.

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project)లో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్‌ కుంగుబాటు, పియర్స్, గేట్లు దెబ్బతినడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో సీపేజీలు సహా పలు సమస్యలపై విచారణ కొనసాగుతోంది. విచారణలో భాగంగా జస్టిస్‌ పీసీ ఘోష్‌‌(Justice PC Ghosh)న్యాయ విచారణ కమిషన్ను హైడ్రాలజీ, నిపుణుల కమిటీ ఇంజినీర్లు కలిశారు. ఈ మేరకు రెండు వారాల లోపు మధ్యంతర నివేదిక, సాధ్యమైనంత త్వరగా పూర్తిస్థాయి నివేదికను అందించాలని రెండు కమిటీల ఇంజినీర్లను కమిషన్ ఆదేశించింది. టెక్నికల్ అంశాలకు సంబంధించిన విషయంలో అఫిడవిట్ ఫైల్ చేయాలని నిపుణుల కమిటీలకు ఆయన సూచించారు.


జూన్ 14న మరి కొంతమంది అధికారులు, ఇతర వ్యక్తులు విచారణకు హాజరు కావాలని కమిషన్ చీఫ్ పీసీ ఘోష్‌ ఆదేశించారు. త్వరలోనే ఆయన మరోసారి సడన్ ఫీల్డ్ విజిట్ చేయనున్నట్లు తెలుస్తోంది. కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణకు సిద్ధమవుతోంది. ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేసిన ప్రతి ఒక్కరినీ బహిరంగ విచారణలో భాగస్వామ్యం చేయనున్నారు. విజిలెన్స్ రిపోర్టు ఇవ్వాలంటూ కమిషన్ ప్రభుత్వాన్ని గతంలో ఆదేశించినప్పటికీ ఇంతవరకూ రిపోర్టు కమిషన్‌కు అందలేదు. దీంతో విజిలెన్స్ రిపోర్టు కోసం మరోసారి ప్రభుత్వం, విజిలెన్స్ శాఖకి లేఖ రాయనున్నట్లు తెలుస్తోంది. టెక్నికల్ అంశాలు పూర్తయిన తర్వాత ఆర్థికపరమైన అంశాల మీద దృష్టి పెట్టనున్నట్లు సమాచారం.

ఇది కూడా చదవండి:

Rain in Hyderabad: భాగ్యనగరంలో భారీ వర్షం.. పలు ప్రాంతాలు జలమయం

Updated Date - Jun 13 , 2024 | 04:27 PM

Advertising
Advertising