ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Kavitha: నేటితో ముగియనున్న కవిత జ్యుడీషియల్ కస్టడీ

ABN, Publish Date - Apr 23 , 2024 | 07:02 AM

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ మంగళవారంతో ముగియనుంది. ఈడీ, సీబీఐ కేసుల్లో ఈనెల 23వ తేదీ వరకు ట్రయల్ కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఈరోజు కవితను అధికారులు వర్చువల్‌గా జడ్జి ముందు హాజరుపరచనున్నారు.

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసు (Delhi Liquor Scam Case)లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ (BRS MLC) కవిత (Kavitha) జ్యుడీషియల్ కస్టడీ (Judicial Custody) మంగళవారంతో ముగియనుంది. ఈడీ (ED), సీబీఐ (CBI) కేసుల్లో ఈనెల 23వ తేదీ వరకు ట్రయల్ కోర్టు (Trial Court) జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఈరోజు కవితను అధికారులు వర్చువల్‌గా జడ్జి ముందు హాజరుపరచనున్నారు. కాగా మరోసారి జ్యుడీషియల్ కస్టడీ పొడగించాలని దర్యాప్తు సంస్థలు ట్రయల్ కోర్టు ముందు విజ్ఞప్తి చేయనున్నాయి. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ఈడీ కేసులో కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై వాదనలు జరగనున్నాయి. ఈ క్రమంలో ట్రయల్ కోర్టు ఈడీ వాదనలు విననుంది. కాగా సీబీఐ కేసులో కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై మే 2 వ తేదీన ప్రత్యేక న్యాయమూర్తి కావేరి భవేజా ధర్మాసనం తీర్పు వెల్లడించనుంది.


కాగా ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో కల్వకుంట్ల కవితది కీలక పాత్ర అని రౌస్‌ అవెన్యూ కోర్టులో సీబీఐ బలమైన వాదనలను వినిపించింది. సీబీఐ తరఫు న్యాయవాది వాదనలను వినిపిస్తూ.. కవితకు బెయిల్‌ ఇస్తే.. ఆమె విడుదలయ్యాక సాక్షులను ప్రభావితం చేస్తారని వివరించారు. ఆమెకు బెయిల్‌ ఇవ్వొద్దని కోరారు. తనపై ఈడీ, సీబీఐ నమోదు చేసిన కేసుల్లో బెయిల్‌ మంజూరు చేయాలంటూ రౌస్‌ అవెన్యూ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే..! ఈ పిటిషన్లపై ప్రత్యేక న్యాయమూర్తి కావేరి భవేజా సోమవారం వేర్వేరుగా విచారణ చేపట్టారు. ఉదయం సీబీఐ కేసుకు సంబంధించిన బెయిల్‌ పిటిషన్‌పై విచారణ జరిగింది. సీబీఐ తరఫున పంకజ్‌గుప్తా, కవిత తరఫున విక్రమ్‌ చౌదరి వాదనలను వినిపించారు. ‘‘ఈ కేసులో ఇప్పటి వరకు ఎటువంటి ఆధారాలు లేవు. కేవలం కొందరి వాంగ్మూలాల ఆధారంగానే కేసు నడుస్తోంది. ఆధారాల్లేకుండానే కవితను అరెస్టు చేశారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కస్టడీలో ఉండగానే, అవసరమేమీ లేకపోయినా సీబీఐ ఎలా అరెస్టు చేస్తుంది? దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. కవిత బీఆర్‌ఎస్‌ పార్టీకి స్టార్‌ కాంపెయినర్‌గా ఉన్నారు. చిదంరబం కేసులో తీర్పు కవిత విషయంలోనూ వర్తిస్తుంది. ఏడేళ్లలోపు శిక్ష పడే కేసులకు అరెస్టు అవసరం లేదు. పీఎంఎల్‌ఏ సెక్షన్‌ 45 ప్రకారం కవిత మహిళగా బెయిల్‌కు అర్హురాలు. సరైనా ఆధారాల్లేని ఈ కేసులో కవితకు బెయిల్‌ మంజూరు చేయండి’’ అని విక్రమ్‌ చౌదరి కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఇరుపక్షాల వాదనలను నమోదు చేసుకున్న కోర్టు.. తీర్పును మే 2వ తేదీకి రిజర్వ్‌ చేశారు.


ఈడీ కేసులో..

మనీలాండరింగ్‌ కేసులో బెయిల్‌ పిటిషన్‌కు సంబంధించి మధ్యాహ్నం విచారణ జరిగింది. ఈడీ తరఫున న్యాయవాది జోహెబ్‌ హుేస్సన్‌, కవిత తరఫున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ సింఘ్వీ వాదనలను వినిపించారు. ఢిల్లీ మద్యం కేసుతో కవితకు ఎటువంటి సంబంధం లేదని, కేవలం రాజకీయ దురుద్దేశంతోనే కవితను కేసులో ఇరికించాలని చూస్తున్నారని సింఘ్వీ వాదించారు. ‘‘ఈ కేసులో తొలుత అనుమానితురాలిగా కూడా లేని కవితను, ఉద్దేశ పూర్వకంగా నిందితురాలిగా చేర్చారు. దాదాపు 5, 6 గంటలు విచారణకు హాజరైనా.. ఆమెను ఒక టెర్రరిస్టు, కరుడుగట్టిన నేరస్థులను ట్రీట్‌ చేసినట్టు దర్యాప్తు సంస్థలు వ్యహరిస్తున్నాయి. విజయ్‌ నాయర్‌ సోషల్‌ మీడియా కో-ఆర్డినేట్‌ చేస్తారనే.. ఆయనతో కవిత భేటీ అయ్యారు. మద్యం కేసులో కవితను ఇరికించిన తీరు అనేక సందేహాలకు తావిస్తోంది. ఈ కేసులో బుచ్చి బాబు నాలుగు స్టేట్‌మెంట్లు ఇచ్చారు. వెంటనే ఆయనకు బెయిల్‌ వచ్చింది. అదే తరహాలో స్టేట్‌మెంట్‌ ఇచ్చిన మరో వ్యక్తి మాగుంట రాఘవకు కూడా బెయిల్‌ దొరికింది. ఆ తర్వాత మాగుంట రాఘవ తండ్రి శ్రీనివాసులుకు ఎన్డీయే అభ్యర్థిగా అవకాశం కల్పించారు. శరత్‌రెడ్డి అప్రూవర్‌గా మారిన తర్వాత బెయిల్‌ ఇచ్చారు. ఆయన బీజేపీకి పెద్ద ఎత్తున ఎలక్టోరల్‌ బాండ్లు ఇచ్చారని ఎస్బీఐ నివేదికతో బహిర్గతమైంది. వీళ్ల స్టేట్‌మెంట్‌ ఆధారంగా కవితను ఈ కేసులో ఇరికించారు. అయినా.. కవిత విచారణకు అన్నివిధా లా సహరిస్తున్నా.. అరెస్టు చేయాల్సిన అవసరం ఏముంది?’’ సంఘ్వీ కోర్టుకు వివరించారు. ఈడీ ఆరోపిస్తున్నట్లు కవిత ఎలాంటి ఆధారాలను ధ్వంసం చేయలేదని పేర్కొన్నారు. ‘‘ఆమె వాడిన ఫోన్లను తన సిబ్బం దికి ఇచ్చారు. అలాంటి ఫోన్లను వాడేవా రెవరైనా ఫార్మట్‌ చేస్తారు. ఈడీ అడిగిన వెంటనే.. తన వద్ద పనిచేసే వారి నుంచి ఆ ఫోన్లను తీసుకుని, దర్యాప్తు అధికా రులకు అందజేశారు’’ అని ఆయన పేర్కొ న్నారు. ఈడీ తరఫు న్యాయవాది జోహెబ్‌ హుస్సేన్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. కవిత విచారణకు సహకరించడం లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ‘‘ఈ కేసులో కవితది కీలక పాత్ర. ఉద్దేశ పూర్వకంగానే 10 ఫోన్ల లో సమాచారాన్ని డిలీట్‌ చేశారు. సాక్ష్యా లను ధ్వంసం చేశారు’’ అని కోర్టుకు చెప్పా రు. న్యాయమూర్తి కల్పించుకుంటూ.. ‘‘సాక్ష్యాలను ధ్వంసం చేశారా? లేదా? అనేది మాత్రమే చెప్పండి. 10 ఫోన్లను ఈడీకి ఇచ్చేముందే ఫార్మట్‌ చేశారా? లేదా?’’ అని ప్రశ్నిం చారు. దానికి జోహెబ్‌ హుస్సేన్‌ స్పందిస్తూ.. ఫోన్లను వేరే వారికి ఇచ్చానని, అందుకే వారు ఫార్మాట్‌ చేశారని కవిత స్టేట్‌మెంట్‌ ఇచ్చినట్లు చెప్పారు. 2023లోనే తాము కేస్‌ ఫైల్‌లో ఈ అంశాన్ని స్పష్టంగా పేర్కొన్నట్లు గుర్తుచేశారు. దీనిపై సింఘ్వీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. రిజాయిండర్‌లో ఈ అంశంపై స్పష్టమైన వివరాలను కోర్టుకు సమర్పిస్తామని చెప్పారు. తదుపరి వాదనలను కొనసా గించడానికి కొంత సమయం కావాలని కోరారు. సమయం తక్కువగా ఉన్నం దున విచారణను మంగళ వారం కొనసాగిస్తామని న్యాయమూర్తి తెలిపారు. కాగా.. తన కుమారుడికి పరీక్షలున్నందున బెయిల్‌ ఇవ్వాలంటూ కవిత గతంలో పిటిషన్‌ వేయడగా.. కోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే..! దాంతో ఈడీ కేసులో బెయిల్‌ కోసం గత నెల 25న.. సీబీఐ కేసులో బెయిల్‌ కోసం ఈ నెల 15న పిటిషన్లు వేశారు. ఆరోగ్య సమస్యలను కారణంగా చూపారు. మరోవైపు కవితకు విధించిన సీబీఐ కస్టడీ మంగళవారంతో పూర్తికానుంది. దాంతో ఆమెను తిరిగి కోర్టులో హాజరుపరుస్తారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నా గెలుపు ఖాయం

మోదీకి ఓటమి భయం

భార్య పుట్టినరోజు జరిగిన రెండో రోజే.. ఘోర రోడ్డు ప్రమాదం

Updated Date - Apr 23 , 2024 | 07:04 AM

Advertising
Advertising