ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

KCR: రతన్ టాటా మృతిపట్ల కేసీఆర్ సంతాపం

ABN, Publish Date - Oct 10 , 2024 | 09:00 AM

మానవతావాది రతన్ టాటా మృతి భారత పారిశ్రామిక రంగానికే కాకుండా సమాజ సంక్షేమాన్ని ప్రగతిని కాంక్షించే ప్రతి ఒక్కరికీ తీరని లోటని కేసీఆర్ అన్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించానని.. శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

హైదరాబాద్: రతన్ టాటా మృతి (Ratan Tata passed away) పట్ల బీఆర్ఎస్ అధ్యక్షడు (BRS Chief), తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ (Ex CM KCR) సంతాపం (condolence) వ్యక్తం చేశారు. ఆర్థిక ప్రగతికి మానవత్వాన్ని అద్దిన అరుదైన పారిశ్రామిక వేత్త రతన్ టాటా అని, సమాజ హితుడుగా.. తాత్వికత, దార్శనిక కార్యాచరణ ప్రజా సంక్షేమాన్ని కాంక్షించే ప్రతి ఒక్కరికీ ఆదర్శమని అన్నారు. భారత సమాజం గర్వించే ప్రపంచ వ్యాపార దిగ్గజం, పద్మ విభూషణ్ రతన్ టాటా అని పేర్కొన్నారు. పారిశ్రామిక ప్రగతికి మానవీయ కోణాన్ని అద్దిన మానవతావాది, దార్శనికుడు, పరోపకారి రతన్ టాటా అని కేసీఆర్ కొనియాడారు.


అభివృద్ధి ఫలాలు కింది స్థాయికి చేరుకోవాలనే సామాజిక ఆర్థిక తాత్వికతను సొంతం చేసుకున్న అరుదైన పారిశ్రామిక వేత్త రతన్ టాటా అని కేసీఆర్ తెలిపారు. సమాజ సంక్షేమం కోసం, రేపటి తరాల ఉజ్వల భబిష్యత్తు కోసం జీవితకాలం తపించిన రతన్ టాటా ఆదర్శాలు, కార్యాచరణ ప్రపంచ ఆర్థిక పారిశ్రామిక రంగానికి దిక్సూచిగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వ ఆహ్వానం మేరకు ఒక కార్యక్రమానికి హాజరై., నూతన తెలంగాణ రాష్ట్రం అనతికాలంలో సాధిస్తున్న అభివృద్ధిని అభినందించడం, సాంకేతిక పారిశ్రామిక రంగాల్లో నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసిన దార్శనిక కార్యాచరణ పట్ల రతన్ టాటా ఆనందాన్ని వ్యక్తం చేయడం తెలంగాణకు గర్వకారణమని కేసీఆర్ స్మరించుకున్నారు. మానవతావాది రతన్ టాటా మృతి భారత పారిశ్రామిక రంగానికే కాకుండా సమాజ సంక్షేమాన్ని ప్రగతిని కాంక్షించే ప్రతి ఒక్కరికీ తీరని లోటని కేసీఆర్ అన్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించానని.. శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.


కాగా భారత దేశ పారిశ్రామిక చరిత్రలో ఒక శకం ముగిసింది! జాతీయ, అంతర్జాతీయ వాణిజ్య యవనికపై తనదైన ముద్ర వేసిన పారిశ్రామిక వేత్త, చైర్మన్‌ ఎమెరిటస్‌ ఆఫ్‌ టాటా సన్స్‌.. రతన్‌ నావల్‌ టాటా (86) ఇక లేరు. వంటగదిలో వాడే ఉప్పు నుంచి.. ఆకాశంలో ఎగిరే విమానాల దాకా.. ఎన్నెన్నో ఉత్పత్తులు, సేవలతో భారతీయుల నిత్యజీవితంలో భాగమైన టాటా సామ్రాజ్యాన్ని రెండు దశాబ్దాలపాటు నడిపించిన ఆ పారిశ్రామిక దిగ్గజం.. మరలిరాని లోకాలకు తరలిపోయారు! రక్తపోటు స్థాయులు అకస్మాత్తుగా పడిపోవడంతో మూడు రోజుల క్రితం ముంబైలోని బ్రీచ్‌క్యాండీ ఆస్పత్రిలో చేరిన రతన్‌ టాటా ఆరోగ్య పరిస్థితి విషమించి.. బుధవారం రాత్రి తుది శ్వాస విడిచారు. తన ఆరోగ్యంపై సోషల్‌ మీడియాలో ఆందోళన వ్యక్తం కావడంతో.. ‘నేను బాగానే ఉన్నా.. ఆందోళన వద్దు’ అంటూ ప్రకటన చేసిన మూడురోజులకే ఆయన కన్నుమూశారు. టాటా గ్రూప్‌ వ్యవస్థాపకుడు జంషెట్జీ టాటాకు ముని మనవడైన రతన్‌ టాటా 1937 డిసెంబరు 28న ముంబైలో జన్మించారు. తల్లిదండ్రులు సూని టాటా, నావల్‌ టాటా.. ఆయన పుట్టిన పదేళ్లకు విడిపోవడంతో, రతన్‌ టాటా తన నాయనమ్మ అయిన నవాజ్‌బాయ్‌ టాటా వద్ద పెరిగారు. ముంబై, సిమ్లాల్లో కొంతకాలం చదివిన అనంతరం.. ఉన్నత విద్యాభ్యాసం నిమిత్తం అమెరికాకు వెళ్లారు. అమెరికాలోని రివర్‌డేల్‌ కంట్రీ హైస్కూల్‌లో పట్టా పుచ్చుకున్న అనంతరం కార్నెల్‌ యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్‌ అండ్‌ స్ట్రక్చరల్‌ ఇంజనీరింగ్‌ విద్యను అభ్యసించారు. 1959లో డిగ్రీ పట్టా పుచ్చుకున్న రతన్‌ టాటా.. 2008లో అదే కార్నెల్‌ యూనివర్సిటీకి 50 మిలియన్‌ డాలర్ల విరాళం ఇచ్చారు. ఆ విశ్వవిద్యాలయ చరిత్రలోనే అతిపెద్ద అంతర్జాతీయ దాతగా నిలిచారు. అమెరికాలో పట్టభద్రుడైన అనంతరం.. 1961లో ఆయన టాటా గ్రూపులో చేరారు. తొలుత టాటా స్టీల్‌లో చిరుద్యోగిగా చేరిన ఆయన గ్రూపులోని వివిధ కంపెనీల్లో విభిన్న హోదాల్లో పనిచేశారు. 1971లో నేషనల్‌ రేడియో అండ్‌ ఎలకా్ట్రనిక్స్‌ కంపెనీ డైరెక్టర్‌ ఇన్‌చార్జిగా.. 1981లో టాటా ఇండస్ట్రీస్‌ చైర్మన్‌గా.. ఇలా పలు బాధ్యతలు నిర్వర్తించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తు్న్న అమ్మవారు..

గొప్ప మానవతావాదిని కోల్పోయాం: సీఎం చంద్రబాబు

దేశం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయింది: సీఎం రేవంత్ రెడ్డి

వ్యాపారాల్లో సూపర్ మ్యాన్.. లవ్‌లో ఫెయిల్..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Oct 10 , 2024 | 09:00 AM