TS News: లిఫ్ట్ అడగడం.. ఆపై రేప్ కేసు పెడతా అంటూ బెదిరింపులు.. కిలాడీ లేడీ అరెస్ట్
ABN, Publish Date - Jan 03 , 2024 | 01:59 PM
Telangana: నగరంలోని జూబ్లీహిల్స్‌లో కిలాడీ లేడీని పోలీసులు అరెస్ట్ చేశారు. రోడ్డు మీద వెళ్లే వారిని లిఫ్ట్ అడగడం... ఆపై రేప్ చేసేందుకు ట్రై చేశావంటూ ఫిర్యాదు చేస్తానంటూ బెదిరిస్తూ డబ్బులు గుంజుతున్న మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాను అడ్వకేట్ అని... తనకు అన్ని సెక్షన్లు తెలుసు అంటూ సదరు మహిళ దబాయింపులకు సైతం పాల్పడుతున్న విషయాన్ని పోలీసులు గుర్తించారు.
హైదరాబాద్, జనవరి 3: నగరంలోని జూబ్లీహిల్స్‌లో కిలాడీ లేడీని పోలీసులు అరెస్ట్ చేశారు. రోడ్డు మీద వెళ్లే వారిని లిఫ్ట్ అడగడం... ఆపై రేప్ చేసేందుకు ట్రై చేశావంటూ ఫిర్యాదు చేస్తానంటూ బెదిరిస్తూ డబ్బులు గుంజుతున్న మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాను అడ్వకేట్ అని... తనకు అన్ని సెక్షన్లు తెలుసు అంటూ సదరు మహిళ దబాయింపులకు సైతం పాల్పడుతున్న విషయాన్ని పోలీసులు గుర్తించారు.
అసలేం జరిగిందంటే...
జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ నుంచి కేబీఆర్ పార్క్ దాకా లిఫ్ట్ కావాలంటూ ఓ కారులో ఎక్కిన మహిళ.. ఆపై బట్టలు చించుకుని రేప్ కేసు పెడతా అంటూ డ్రైవర్‌తో బెదిరింపులకు దిగింది. దీంతో భయాందోళనకు గురైన బాధిత డ్రైవర్ పరమానంద ఈ వ్యవహారంపై జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే కేసు నమోదు చేసిన పోలీసులు కిలాడీ లేడీని అరెస్ట్ చేశారు. ఆమెపై ఐపీసీ 389 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.
విచారణలో భాగంగా కిలాడీ బాగోతం మొత్తం బయటపడింది. కిలాడీ లేడీ సయీదా నయీమా సుల్తానా(32)గా గుర్తించారు. కిలాడీ లేడీపై నగర వ్యాప్తంగా పలు స్టేషన్లలో 17 కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కిలాడీ లేడీ వద్ద వందలాది కేసులకు సంబంధించిన కేస్ స్టడీస్ వివరాలు ఉన్నట్లు గుర్తించారు. వాటిని అడ్డుపెట్టుకుని ప్రతి కేసులో ఎలాంటి శిక్ష పడుతుందనిని బాధితులను బెదిరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పలువురు అమాయకుల మీద కిలాడీ లేడీ కేసులు పెట్టినట్లు కూడా పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Jan 03 , 2024 | 01:59 PM