ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kodandareddy: హైడ్రాపై ఎంఐఎం, బీఆర్‌ఎస్‌వి అడ్డగోలు విమర్శలు

ABN, Publish Date - Aug 26 , 2024 | 01:52 PM

Telangana:రాష్ట్ర సర్కార్ హైడ్రాను ఏర్పాటు చేసి చెరువులు, కుంటలు, నాలాలు రక్షిస్తోందని కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... దూరదృష్టితో హైడ్రాను ఏర్పాటు చేసిందన్నారు. రాజకీయాలకు అతీతంగా హైడ్రా పనిచేస్తుందని తెలిపారు. ప్రొటెక్షన్ ఆఫ్ లేక్స్ కమిటీ కూడా గతంలో వేసిందే అని చెప్పుకొచ్చారు.

Kisan Cell National Vice President Kodanda Reddy

హైదరాబాద్, ఆగస్టు 26: తెలంగాణ సర్కార్ (Telangana Govt) హైడ్రాను (Hydra) ఏర్పాటు చేసి చెరువులు, కుంటలు, నాలాలు రక్షిస్తోందని కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి ( Kisan Cell National Vice President Kodanda Reddy) అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... దూరదృష్టితో హైడ్రాను ఏర్పాటు చేసిందన్నారు. రాజకీయాలకు అతీతంగా హైడ్రా పనిచేస్తుందని తెలిపారు. ప్రొటెక్షన్ ఆఫ్ లేక్స్ కమిటీ కూడా గతంలో వేసిందే అని చెప్పుకొచ్చారు. రాష్ట్ర విభజన కాకముంటే కాంగ్రెస్ సర్కార్ 2030 వరకు హెచ్‌ఎమ్‌డీఏ (HMDA) ద్వారా మాస్టర్ ప్లాన్ రూపొందించిందన్నారు.

Sanjay Roy: ఈ నీచుడు మామూలోడు కాదు.. అధికారులకే ముప్పు తిప్పలు పెడుతున్న సంజయ్ రాయ్


తాగునీటి అవసరాల కోసం కూడా మాస్టర్ ప్లాన్‌లో లేక్స్ ప్రొటెక్షన్ చేయాలని నిర్ణయం తీసుకుందన్నారు. 2014 నుంచి అధికారంలో ఉన్న బీఆర్ఎస్ (BRS) అక్రమ నిర్మాణాలకు సపోర్ట్ చేసిందని ఆరోపించారు. హైడ్రా ఏర్పాటు చేసి ప్రజల మన్నన్నలు పొందుతున్న సీఎం రేవంత్‌పై (CM Revanth Reddy) ఎంఐఎం, బీఆర్ఎస్ నేతలు అడ్డగోలుగా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. సామాన్య ప్రజలు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారన్నారు. ప్రజలు కూడా ర్యాలీ చేస్తున్నారన్నారు. హుస్సేన్ సాగర్ కాపాడుకోవాలని విజయభాస్కర్ రెడ్డి కాలంలో బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు, నెక్లస్ రోడ్ ఏర్పాటైందన్నారు.


ప్రకృతిని కాపాడడానికి చెరువులు కాపాడాలన్నారు. హైదరాబాద్‌కు తాగునీటి అవసరాల కోసం కృష్ణ, గోదావరి నీటిని తీసుకొచ్చిందన్నారు. కాంగ్రెస్ సర్కారే రానున్న 30 ఏళ్ల వరకు తాగునీటి కోసం మాస్టర్ ప్లాన్ రూపొందించారని తెలిపారు. ధర్మం కోసం భగవత్ గీతను కూడా స్ఫూర్తిగా తీసుకున్నా అని సీఎం రేవంత్ నిన్న చెప్పారన్నారు. హెచ్‌ఎండీలో అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని కోదండరెడ్డి వ్యాఖ్యలు చేశారు.

TPCC: టీపీసీసీ చీఫ్‌గా మహేష్ గౌడ్.. ఏ క్షణమైనా ప్రకటన..?


హైదరాబాద్ నగరంలో హైడ్రా కూల్చివేతలు ఆక్రమణదారుల గుండెల్లో దడపుట్టిస్తున్నాయి. వరసగా కూల్చివేతలు చేస్తూ అక్రమార్కుల గుండెల్లో హైడ్రా నిద్రపోతోంది. పేద, ధనిక, సినిమా స్టార్లు, రాజకీయ నేతలు ఇలా ఎవరినీ వదిలిపెట్టకుండా కబ్జాలకు అడ్డుకట్ట వేస్తోంది. ప్రభుత్వ స్థలాన్ని అంగులం ఆక్రమించిన తీవ్రంగా స్పందిస్తోంది. తాజాగా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలో ప్రభుత్వ భూముల్లో వెలిసిన అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. రాయదుర్గం సర్వే నంబర్ 3, 4, 5, 72లోని ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా కట్టిన భవనాలను కూల్చివేస్తున్నారు. అయితే తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా చర్యలు చేపట్టారంటూ జీహెచ్ఎస్‌సీ టౌన్ ప్లానింగ్ అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. తమ ఇళ్లను కూల్చవద్దంటూ ఆందోళనకు దిగారు. అధికారులతో స్థానికులు వాగ్వాదానికి దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అధికారుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి పోలీసులు భారీగా చేరుకున్నారు. పోలీసుల ఆధ్వర్యంలో కూల్చివేతల పర్వం సాగుతోంది.


ఇవి కూడా చదవండి

Drugs: సికింద్రాబాద్‌లో భారీగా మాదకద్రవ్యాలు స్వాధీనం

CMRF Scam: సీఎం‌ఆర్‌ఎఫ్ స్కాంలో 17 ఆస్పత్రులపై కేసులు నమోదు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 26 , 2024 | 02:10 PM

Advertising
Advertising
<