ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Raj Pakala: పోలీసుల నోటీసులపై రాజ్‌పాకాల స్పందన

ABN, Publish Date - Oct 28 , 2024 | 02:25 PM

Telangana: మోకిలా పోలీసుల నోటీసులపై మాజీ మంత్రి కేటీఆర్ బావమరిది స్పందించారు. బీఎన్‌ఎస్‌ఎస్ 35(3) సెక్షన్ ప్రకారం నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. రేవ్ పార్టీ కేసుకు సంబంధించి విచారించాల్సి ఉందని పోలీసులు ఆ నోటీసులో పేర్కొన్నారు. ఈ క్రమంలో నోటీసులపై రాజ్ పాకాల స్పందిస్తూ..

KTR Brother-in-law Rajpakala response to police notices

హైదరాబాద్, అక్టోబర్ 28: జన్వాడ ఫామ్‌హౌస్ ఘటనకు సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలకు మోకిలా పోలీసులు (Police)నోటీసులు ఇచ్చారు. మోకిలా పోలీసులు ఇచ్చిన నోటీసులపై ఎట్టకేలకు కేటీఆర్ బావమరిది స్పందించారు. మోకిలా పోలీస్ స్టేషన్‌కు రాజ్ పాకాల న్యాయవాదులు చేరుకున్నారు. విచారణకు వచ్చేందుకు రెండు రోజుల సమయం కావాలని పాకాల న్యాయవాదులు పోలీసులను కోరారు.

KTR: ఇంట్లో పార్టీ చేసుకుంటే తప్పా..



కాగా.. విచారణకు హాజరుకావాలంటూ కేటీఆర్ బావమరిదికి పోలీసులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. బిఎన్‌ఎస్‌ఎస్ 35(3) సెక్షన్ ప్రకారం నోటీసులు జారీ చేశారు. రేవ్ పార్టీ కేసుకు సంబంధించి విచారించాల్సి ఉందని పోలీసులు ఆ నోటీసులో పేర్కొన్నారు. ఈరోజు (సోమవారం) తమ ముందు హాజరు కావాలన్నారు. అడ్రస్ ప్రూఫ్‌లతో పాటు, కేసుకు సంబంధించిన ఆధారాలు సమర్పించాలని కోరారు. విచారణకు హాజరుకాకుంటే తదుపరి చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈరోజు మోకిలా పీఎస్‌కు హాజరు కాకుంటే బిఎన్‌ఎస్‌ఎస్ 35 (3),(4),(5),(6) సెక్షన్ల ప్రకారం అరెస్టుకు దారి తీస్తుందని పేర్కొంటూ రాజ్ పాకాలకు మోకిలా ఇన్స్‌పెక్టర్ నోటీసులు జారీచేశారు. అయితే రాజ్ పాకాల అందుబాటులో లేకపోవడంతో ఆయన ఉంటున్న విల్లాకు నోటీసులను అంటించారు పోలీసులు.


మరోవైపు ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే రాజ్ పాకాల హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో రాజ్ పాకాల లంచ్ మోషన్ పిటిషన్‌ను దాఖలు చేశారు. పోలీసులు తనని అక్రమంగా అరెస్టు చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారన్న సమాచారం నేపథ్యంలో ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండేందుకు వీలుగా ముందుస్తు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టులో రాజ్‌ పాకాల పిటిషన్ వేసినట్లు సమాచారం.

Balineni: జగన్, షర్మిల వైఎస్ పరువు తీస్తున్నారు


ఇదిలా ఉండగా.. జన్వాడలోని రాజ్‌ పాకాల ఫామ్‌హౌస్‌పై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో విదేశీ మద్యంతో పాటు క్యాసినో ఆట వస్తువులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పార్టీలో అనుమతి లేకుండా వినియోగిస్తున్న విదేశీ మద్యం 7.6 లీటర్లు, ఐఎంఎఫ్ఎల్‌ మద్యం 8.1 లీటర్లు, బీర్లు 6 లీటర్లను స్వాధీనం చేసుకున్నారు. పార్టీలో 22 మంది పురుషులు, 16 మంది మహిళలు పాల్గొన్నారు. వీరందరికీ అక్కడే డ్రగ్‌ టెస్టులు చేసేందుకు ప్రయత్నించగా మహిళలు నిరాకరించారు. అయితే పురుషులందరికీ డ్రగ్‌ టెస్టులు నిర్వహించగా విజయ్‌ మద్దూరికి పాజిటివ్‌ వచ్చింది. అయితే నిన్న పార్టీలో హాజరైన మహిళలు.. మోకిలా పోలీస్ స్టేషన్‌కు వస్తున్నారు. ఫాంహౌస్‌లో దాడి సందర్భంగా పలువురి సెల్‌ఫోన్లను పోలీసులు సీజ్ చేశారు. దీంతో సీజ్ చేసిన తమ ఫోన్స్ ఇవ్వాలని పోలీస్ స్టేషన్‌కు మహిళలు వస్తున్నారు. ‘‘మా వ్యక్తిగత సమాచారం ఇచ్చామని.. మా ఫోన్స్ ఇవ్వాలి’’ అని పోలీసులను మహిళలు కోరుతున్నారు.


ఇవి కూడా చదవండి

Vemula: కేసీఆర్ సూచించిన వారికి పీఏసీ చైర్మన్ ఇవ్వాలి

TG News: హైదరాబాద్‌లో ఫుడ్ పాయిజన్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 28 , 2024 | 02:57 PM