KTR: ఆంధ్రజ్యోతి కథనాలపై స్పందించిన కేటీఆర్.. కలల సౌధం ఖరీదు 25 వేలు అంటూ విమర్శలు
ABN, Publish Date - Oct 04 , 2024 | 10:18 AM
మూసీ సుందరీకరణ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సర్కార్ పేదల పొట్ట కొడుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీరామారావు(KTR) విమర్శించారు.
హైదరాబాద్: మూసీ సుందరీకరణ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సర్కార్ పేదల పొట్ట కొడుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీరామారావు(KTR) విమర్శించారు. ఈ మేరకు ఆయన ఆంధ్రజ్యోతి కథనాలను ఎక్స్‌లో షేర్ చేశారు. పేదల గుండెలు ఆగుతున్నా.. కాంగ్రెస్ ధనదాహం తీరట్లేదని అన్నారు.
"ఆగుతున్న గుండెలు - విడిపోతున్న కుటుంబాలు, అయినా తగ్గని సర్కార్ దాహం. కలల సౌధం ఖరీదు అక్షరాల 25 వేలు. కష్టపడి పస్తులుండి పైసా పైసా కూడేసి, బ్యాంకు నుండి అప్పు తెచ్చి కట్టిన గుడును కూల్చుతారని భయంతో పోతున్న ప్రాణాలు.16 కాదు 18 మంది అయినా సరే ఒకే ఇంట్లో ఉమ్మడిగా ఉన్న కుటుంబాలను రోడ్డుకు ఈడ్చి కుటుంబాల్లో చిచ్చులు పెట్టిన మూర్కుడు రేవంత్ రెడ్డి. ఇండ్లు ఖాళీ చేస్తే డబుల్ బెడ్ రూమ్‌తో పాటు రూ.25 వేల పారితోషకం అంటూ అధికారుల వెకిలి ఆఫర్లు.
కోటి ఆశలతో లక్షలు, కోట్లు వెచ్చించి కట్టుకున్న ఇండ్లకు రూ.25 వేలా. రేవంత్ తన అన్న ఇంటికి, తన మంత్రుల ఇంటికి రూ.25 వేలు కాదు రూ.50 వేలు ఇచ్చి కూల్చమంటారా ఒకసారి అడుగు. ఇళ్లు పోతున్నాయి అనే భయంతో బుచ్చమ్మ, కుమారన్న ప్రాణాలు పోయాయి. నీ ధన దాహానికి, నీ స్కాములకు ఇంకా ఎన్ని ప్రాణాలు బలితీసుకుంటావో చెప్పు"అని కేటీఆర్ రేవంత్‌ను ప్రశ్నించారు.
కేటీఆర్ షేర్ చేసిన ఆంధ్రజ్యోతి ఆర్టికల్స్ కింద లింక్‌లను క్లిక్ చేసి చూడవచ్చు..
Hyderabad: 16 మందికి ఒక డబుల్ ఇల్లా?
Hyderabad: స్వచ్ఛందంగా ఖాళీ చేస్తే ‘డబుల్’తో పాటు పాతిక వేలు
For Latest news and National news click here
Updated Date - Oct 04 , 2024 | 10:21 AM