ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

KTR: సీఎం రేవంత్ రెడ్డిని వదిలి పెట్టను: కేటీఆర్

ABN, Publish Date - Nov 01 , 2024 | 10:26 AM

తెలంగాణలో ఉన్న ప్రస్తుత పరిస్థితులు చూసి రాజకీయాలు వదిలేద్దామని అనుకున్నానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇక తెలంగాణ అభివృద్ధి కోసం రాజకీయాల్లో కొనసాగుతున్నాని స్పష్టం చేశారు. తనను, తన కుటుంబాన్ని టార్గెట్ చేసిన సీఎం రేవంత్ రెడ్డిని వదిలి పెట్టనని హెచ్చరించారు.

హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ (BRS Working President), మాజీ మంత్రి కేటీఆర్ (Ex Minister KTR) తెలంగాణ రాజకీయాలపై (Telangana Politics) సంచలన వ్యాఖ్యలు (Sensational comments) చేశారు. ఎక్స్‌లో ఆస్క్‌ కేటీఆర్‌ (Ask KTR)లో పలు విషయాలను వెల్లడించారు. తెలంగాణలో ఉన్న ప్రస్తుత పరిస్థితులు చూసి రాజకీయాలు వదిలేద్దామని అనుకున్నానని అన్నారు. ఇక తెలంగాణ అభివృద్ధి కోసం రాజకీయాల్లో కొనసాగుతున్నాని స్పష్టం చేశారు. తనను, తన కుటుంబాన్ని టార్గెట్ చేసిన సీఎం రేవంత్ రెడ్డిని వదిలి పెట్టనని హెచ్చరించారు.


బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని కేటీఆర్ అన్నారు. ప్రతిరోజు తమకు దిశానిర్దేశం చేస్తున్నారని, 2025 నుంచి కేసీఆర్ విశ్వరూపం చూస్తారని తెలిపారు. పార్లమెంట్‌కు వెళ్లడం కన్నా తనకు తెలంగాణలో ఉండడమే ఇష్టమని వివరించారు. ఇప్పుడు ఉన్న జీహెచ్ఎంసీ స్వరూపం ఎలా మారుతుందో తెలియదని, జీహెచ్ఎంసీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో చెప్పలేమని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీలు కలిసి పనిచేస్తున్నాయని కేటీఆర్ ఆరోపించారు.

మూసీ పునరుజ్జీవనం దేశంలోనే అతిపెద్ద కుంభకోణమని కేటీఆర్ విమర్శించారు. అతి తక్కువ కాలంలో కాంగ్రెస్ రాష్ట్రాన్ని నాశనం చేసిందని మండిపడ్డారు. హైడ్రా ఒక బ్లాక్ మెయిలింగ్ టూల్ అని ఆరోపించారు. హైడ్రాతో పేద మధ్యతరగతి వాళ్ళ ఇళ్లను కూల్చుతున్నారని, కానీ పెద్దవాళ్ళ ఇళ్ల జోలికి ఎందుకు పోవట్లేదని ప్రశ్నించారు. ఇకపై పార్టీ బలోపేతంపై దృష్టి పెడతామని, త్వరలో మహిళా, విద్యార్థి కమిటీలు వేస్తామని చెప్పారు. విలువలు లేని రాజకీయాలు మనం చేయలేమని... అవి ఎక్కువ కాలం ఉండవని కేటీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆ ప్రచారాన్ని నమ్మొద్దు: సీఎం సిద్ధరామయ్య

మంత్రి లోకేష్ అమెరికా పర్యటన సక్సెస్

శ్రీకాకుళం జిల్లాలో సిలిండర్ల పథకాన్ని ప్రారంభించనున్న సీఎం

అట్లాంటాలో నారా లోకేస్ రెడ్ బుక్ ప్రస్తావన..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Nov 01 , 2024 | 10:26 AM