ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Krishnarao: హైడ్రా కూల్చివేతలపై కూకట్‌పల్లి ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్యలు

ABN, Publish Date - Sep 23 , 2024 | 10:41 AM

Telangana: హైడ్రా కమిషనర్ వ్యాఖ్యలకు ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని ఎమ్మెల్యే కృష్ణారావు అన్నారు. కూల్చివేతలు చేశాక డిబ్రిస్ తీసివేయకుండా, చెత్తను జమ చేస్తున్నారని తెలిపారు. నల్ల చెరువులో నిన్న (ఆదివారం) కూల్చివేతలు చేపట్టిన స్థలం పట్టదారులకు చెందిందని.. పట్టాదారులకు ఏ విధమైన న్యాయం చేయనున్నారని ప్రశ్నించారు.

Kukatpally MLA Madhavaram Krishna rao

హైదరాబాద్, సెప్టెంబర్ 23: శనివారం, ఆదివారం వస్తుందంటే హైదారాబాద్‌లో ప్రజలు భయంతో ఉండాల్సిన పరిస్థితి ఉందని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు (MLA Madhavaram Krishna rao) వ్యాఖ్యలు చేశారు. కూకట్‌పల్లి నల్ల చెరువులో హైడ్రా (HYDRA)కూల్చివేతలపై సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. హైడ్రా కమిషనర్ వ్యాఖ్యలకు ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారన్నారు. కూల్చివేతలు చేశాక డిబ్రిస్ తీసివేయకుండా, చెత్తను జమ చేస్తున్నారని తెలిపారు. నల్ల చెరువులో నిన్న (ఆదివారం) కూల్చివేతలు చేపట్టిన స్థలం పట్టదారులకు చెందిందని.. పట్టాదారులకు ఏ విధమైన న్యాయం చేయనున్నారని ప్రశ్నించారు.

Tirumala Laddu: తిరుమల లడ్డూ కల్తీపై ‘సిట్‌’కు ఏపీ సర్కార్ ఆదేశం


చెరువులలో పట్టాలు ఉన్న వారికి నష్ట పరిహారం చెల్లించి, ఆ స్థలాన్ని ప్రభుత్వం తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిన్న షెడ్లు కూల్చివేస్తున్న సమయంలో అక్కడ ఉంటున్న వారికి కనీసం వారి సామాన్లను తరలించేందుకు కూడా సమయం ఇవ్వకపోవడం దురదృష్టకరమని మండిపడ్డారు. హైడ్రా విధి విధానాలను స్పష్టం చేయాలన్నారు. రాత్రి నోటీసులు ఇచ్చి, ఉదయాన్నే కూల్చి వేస్తే అక్కడ ఉంటున్న వారి పరిస్థితి ఏంటి అంటూ మండిపడ్డారు. నిన్న కూల్చివేతలలో నష్టపోయిన వారికి నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. శనివారం, ఆదివారం హైడ్రా కాదు హైడ్రామా చేస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. కోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా నిన్న కూల్చివేతలు చేపట్టారని విమర్శించారు. ప్రజలను సంక్షేమ పథకాల నుంచి దారి మళ్లించేందుకు హైడ్రా కూల్చివేతలు చేస్తున్నారని మాధవరం కృష్ణారావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.


నేలమట్టం...

కాగా.. కూకట్‌పల్లిలో, అమీన్‌పూర్‌ మునిసిపాలిటీలోని కిష్టారెడ్డిపేట, పటేల్‌గూడలో ప్రభుత్వ భూముల్లోని నిర్మాణాలను నిన్న హైడ్రా నేలమట్టం చేసిన విషయం తెలిసిందే. కూకట్‌పల్లి శాంతినగర్‌లోని నల్లచెరువు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌ పరిధిలో నాలుగు ఎకరాల విస్తీర్ణంలో, కిష్టారెడ్డిపేటలోని ఎకరంపైగా, పటేల్‌గూడలోని మూడు ఎకరాలకుపైగా విస్తీర్ణంలోని నిర్మాణాలను కూల్చివేసింది. రెవెన్యూ, నీటి పారుదల, పట్టణ ప్రణాళిక విభాగం అధికారులతో కలిసి హైడ్రా బృందం కూల్చివేతలు చేపట్టింది. మూడు ప్రాంతాల్లోని 8ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆక్రమణలు, భవనాలు తొలగించినట్టు హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ తెలిపారు. అయితే తమ సామాన్లను కూడా తీసుకునే సమయం ఇవ్వకుండా నిర్మాణాలు నేలమట్టం చేశారని బాధితులు లబోదిబోమన్నారు. అప్పులు చేసి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే తాము హైడ్రా చర్యతో రూ.లక్షల్లో నష్టపోయి రోడ్డున పడ్డాయని ఆవేదన చెందారు.


ఇవి కూడా చదవండి...

Hyderabad: రికార్డు క్రియేట్ చేసిన హైడ్రా..

Narendra Modi: యూఎస్‌లో మరో రెండు భారతీయ రాయబార కార్యాలయాలు ఏర్పాటు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 23 , 2024 | 11:28 AM