ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Liquor Prices Hike: పెరగనున్న మద్యం ధరలు.. ఎక్కడంటే

ABN, Publish Date - Oct 17 , 2024 | 12:10 PM

తెలంగాణ సర్కార్ మద్యం ధరల పెంపునకు సిద్ధమైనట్లు సమాచారం. సాధారణంగా బీర్ల ఉత్పత్తి కేంద్రాలకు చెల్లించే ధరలను ప్రభుత్వం ప్రతి రెండేళ్లకొకసారి పెంచుతుంది. అలాగే ఈసారి వివిధ రకాల మద్యంపై రూ. 20 నుంచి రూ. 150 పెంచాలని ప్రభుత్వాన్ని బ్రూవరీలు కోరాయి.

telangana

హైదరాబాద్: తెలంగాణ (Telangana)లో మద్యం (Liquor) ద్వారా ప్రభుత్వానికి (Govt.,) భారీగా ఆదాయం (Income) వస్తోంది. ఈ ఏడాది కూడా మద్యం ద్వారా భారీగా ఆదాయం ఆర్జించాలని తెలంగాణ సర్కార్ భావిస్తోంది. అందులో భాగంగానే మద్యం ధరల పెంపునకు (Hike) సిద్ధమైనట్లు సమాచారం. సాధారణంగా బీర్ల ఉత్పత్తి కేంద్రాలకు చెల్లించే ధరలను ప్రభుత్వం ప్రతి రెండేళ్లకొకసారి పెంచుతుంది. అలాగే ఈసారి వివిధ రకాల మద్యంపై రూ. 20 నుంచి రూ. 150 పెంచాలని ప్రభుత్వాన్ని బ్రూవరీలు కోరాయి.


ఏటా బతుకమ్మ, దసరా సందర్భంగా రాష్ట్రంలో లిక్కర్ అమ్మకాలు భారీగా పెరుగుతున్నాయి. ఈసారి కూడా మందుబాబులు అదే ఒరవడిని కొనసాగిస్తూ భారీ రికార్డు నెలకొల్పారు. కేవలం 10 రోజుల వ్యవధిలో రూ.1,100 కోట్లకుపైగా మందును తాగేశారు. పది రోజుల్లో వెయ్యి కోట్ల మేర మద్యం విక్రయాలు జరిగినట్లు ఆబ్కారీ అధికారులు చెబుతున్నారు. బార్లు, మద్యం దుకాణాలతో పాటుగా పబ్‌లలోనూ అమ్మకాలు పెరిగాయి. దీంతో సర్కార్ ఖజానాకు.. మద్యం భారీగా ఆదాయం తెచ్చి పెట్టింది. మద్యం అమ్మకాల్లో ఎప్పటిలాగే హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచింది.


17 లక్షల బీర్లు..

రాష్ట్రంలో 2 వేల 260 మద్యం దుకాణాలు, 1,171బార్లు, రెస్టారెంట్లు ఉన్నాయి. వీటితో పాటుగా పబ్బుల్లోనూ మద్యం అమ్మకాలు కొనసాగుతున్నాయి. ఏటా దసరా వేళ తెలంగాణలో మద్యం ఎక్కువ మొత్తంలో అమ్ముడవుతుంది. ఈ సారి అదే అంచనాతో ముందుగానే ఎక్సైజ్ శాఖ అధికంగా మద్యం నిల్వలను సిద్ధం చేసుకుంది. ఆర్డర్లు కూడా ఊహించిన దాని కన్నా అధికంగా ఉండటంతో రాష్ట్ర సర్కార్ ఖజానాకు కాసుల వర్షం కురిసింది. బార్లు సైతం తగినంత స్టాక్‌ను అందుబాటులో ఉంచాయి. దసరాకు ముందు నుంచే మొదలైన మద్యం కిక్కు శని, ఆదివారాల్లో పీక్స్‌కు చేరింది.

సెప్టెంబర్ 30 వరకు 2 వేల 838 కోట్ల అమ్మకాలు జరగ్గా... అక్టోబర్ నెల ప్రారంభం నుంచి 11వ తేదీ వరకు రూ 1,100 కోట్ల మేర విలువైన 10 లక్షల 44వేల కేసుల మద్యం అమ్మకాలు జరిగినట్లు ఆబ్కారీ అధికారులు చెబుతున్నారు. 10 రోజులవ్యవధిలోనే 17 లక్షల 59 వేల బీర్లు అమ్ముడుపోయాయట. మద్యం అమ్మకాల్లో ఉమ్మడి రంగారెడ్డి టాప్‌లో ఉండగా ఉమ్మడి కరీంనగర్, నల్లగొండ, వరంగల్ జిల్లాలు తర్వాతి మూడు స్థానాల్లో ఉన్నాయి.


స్వల్పంగా తగ్గిన ఆదాయం..

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో మద్యం అమ్మకాలు ప్రభుత్వానికి భారీ ఆదాయాన్ని సమకూర్చాయి. గత ఏడాది అక్టోబర్‌ 1 నుంచి 10వ తేదీతో పోలిస్తే ఈ ఏడాది ఇదే సమయంలో పది రోజులకుగానూ అమ్మకాలు కాస్త తగ్గాయి. గ్రేటర్ హైదరాబాద్, సికింద్రాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, శంషాబాద్, సరూర్‌నగర్‌, వికారాబాద్ జిల్లాల పరిధిలో 674 మద్యం దుకాణాలు ఉండగా, 2023లో మద్యం అమ్మకాల ద్వారా రూ.317 కోట్ల 21 లక్షల ఆదాయం సమకూరినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం రూ.312 కోట్లే ఖజానాకు వచ్చింది. గతంతో పోల్చితే ఎక్సైజ్ ఆదాయం రూ.5 కోట్ల 18 లక్షలు తగ్గడం గమనార్హం.

బడ్జెట్ ప్రవేశ పెట్టగా వ్యవసాయానికి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చారు. అయితే బడ్జెట్ సమావేశాల తర్వాత తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది..పండుగలు, పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు ఖచ్చితంగా మద్యం ఉండాల్సిందే . ఎన్నికల సమయాల్లో మందు ఏరులై పారుతుంది. మద్యంతో ఎంజాయ్ చేస్తున్న మందుబాబులకు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం పెద్ద షాకే ఇవ్వబోతుంది. రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మద్యం ఆదాయాన్ని అదనంగా మరో రూ.5,318 కోట్లకు పెంచాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Updated Date - Oct 17 , 2024 | 12:51 PM