Maheshwar Reddy: మేఘా కృష్ణారెడ్డి కంపెనీకి సీఎం రేవంత్ రెడ్డి దోచిపెడుతున్నారు..
ABN, Publish Date - Aug 10 , 2024 | 02:11 PM
కాంట్రాక్టుల పేరుతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కాంట్రాక్టర్ మేఘా కృష్ణారెడ్డికి రాష్ట్ర సంపద దోచి పెడుతున్నారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి(Maheshwar Reddy) ఆరోపించారు. నాసిరకం పనులు చేస్తుందంటూ మేఘా కంపెనీకి కేంద్ర ప్రభుత్వం షోకాజ్ నోటీసులు ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
హైదరాబాద్: కాంట్రాక్టుల పేరుతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కాంట్రాక్టర్ మేఘా కృష్ణారెడ్డికి రాష్ట్ర సంపద దోచి పెడుతున్నారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి(Maheshwar Reddy) ఆరోపించారు. నాసిరకం పనులు చేస్తుందంటూ మేఘా కంపెనీకి కేంద్ర ప్రభుత్వం షోకాజ్ నోటీసులు ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సుంకిశాల ప్రాజెక్టు కూలిపోయి 10రోజులు గడిచినా కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టికి రాలేదా అంటూ ఆయన మండిపడ్డారు. సుంకిశాల పనులు మేఘా కంపెనీయే చేసిందని, అలాంటిది కొడంగల్‌లో చేయబోతే పనులను సైతం ముఖ్యమంత్రి అదే కంపెనీకి ఇవ్వబోతున్నట్లు మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు.
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో మేఘా కృష్ణారెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి సీబీఐకి ఫిర్యాదు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడేమో క్రిమినల్ కాంట్రాక్టర్ మేఘా కృష్ణారెడ్డికే సీఎం దోచిపెడుతున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణలో గొర్రెలను తినేటోడు పోయి.. బర్రెలను తినేటోడు వచ్చాడని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అన్నారు. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దోచుకున్న అవినీతి సొమ్ములో రేవంత్ రెడ్డి వాటా అడుగుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోందని చెప్పుకొచ్చారు. వీరిద్దరికి మధ్యవర్తిగా కాంట్రాక్టర్ మేఘా కృష్ణారెడ్డి సెటిల్మెంట్ చేస్తున్నట్లు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
HYDRA: అక్రమ నిర్మాణాలే లక్ష్యంగా చెలరేగిపోతున్న హైడ్రా..
Ponnam Prabhakar: వారం రోజుల్లో రూ.2లక్షల వరకూ రైతు రుణమాఫీ చేస్తాం..
Bhatti Vikramarka: జల విద్యుత్ కేంద్రాల్లో గరిష్ఠ ఉత్పత్తికి అన్ని చర్యలు చేపట్టాలి..
Updated Date - Aug 10 , 2024 | 02:15 PM