ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Mallareddy: కాంగ్రెస్‌కు ముందుంది మొసళ్ల పండగ

ABN, Publish Date - Jan 21 , 2024 | 04:32 PM

కాంగ్రెస్ అంటేనే పెద్ద దారిద్య్రంమని.. బీఆర్ఎస్ అంటేనే ఓ నమ్మకమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సి. మల్లారెడ్డి ( Mallareddy ) అన్నారు. కాంగ్రెస్ నేతలు గెలవగానే ఎగిరి ఎగిరి పడుతున్నారని మండిపడ్డారు.

హైదరాబాద్: కాంగ్రెస్ అంటేనే పెద్ద దారిద్య్రంమని.. బీఆర్ఎస్ అంటేనే ఓ నమ్మకమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సి. మల్లారెడ్డి ( Mallareddy ) అన్నారు. ఆదివారం నాడు తెలంగాణ భవన్‌లో మల్లారెడ్డి మాట్లాడుతూ... కాంగ్రెస్ నేతలు గెలవగానే ఎగిరి ఎగిరి పడుతున్నారని.. కాంగ్రెస్‌కు ముందుంది మొసళ్ల పండగ అని ఎద్దేవా చేశారు. ఏ హామీని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. ఐదేళ్ల పాటు కాంగ్రెస్ ఏవో మాటలు చెప్పి కాలక్షేపం చేస్తుందని మండిపడ్డారు. కేసీఆర్‌ను సీఎంగా కోల్పోయినందుకు ప్రజలు బాధ పడుతున్నారని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎన్నో ప్రభుత్వాలు కూలగొట్టారన్నారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత ఏం జరుగుతుందో ఎవరికి తెలుసునని అన్నారు. కాంగ్రెస్ అంటే దివాలా తీసిన పార్టీ అని సెటైర్లు వేశారు. కేసీఆర్‌కు త్యాగాల చరిత్ర ఉందని.. ఈ ఓటమి పెద్ద లెక్కలోకి రాదని మల్లారెడ్డి తెలిపారు.

అవిశ్వాస నోటీసులపై మల్లారెడ్డి ఏమన్నారంటే..

మున్సిపాలిటీల్లో అవిశ్వాస నోటీసులపై మాజీ మంత్రి మల్లారెడ్డి స్పందించారు. అవిశ్వాస నోటీసుల తర్వాత ప్రజాప్రతినిధులతో.. కలిసి దుబాయ్, గోవా వెళ్లామని చెప్పారు. టూర్‌కు తీసుకెళ్లి వాళ్లని కూల్‌ చేస్తున్నానని అన్నారు. గోవా బీచ్‌లలో సేద తీరితే వారి మనసు మారుతుందన్నారు. అవిశ్వాస తీర్మానం నోటీసులు కొత్తేమీ కాదన్నారు. సమస్యలు ఎక్కడైనా ఉంటాయని చెప్పారు. BRS కాదు....కాంగ్రెస్ పార్టీయే వెయ్యి మీటర్ల లోపల కూరుకుపోయిందన్నారు. దేశంలో కాంగ్రెస్ ఎన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉందని మల్లారెడ్డి ప్రశ్నించారు.

Updated Date - Jan 21 , 2024 | 10:25 PM

Advertising
Advertising